Before Sleeping: నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే!

| Edited By: Ravi Kiran

Dec 09, 2021 | 6:20 AM

Before Sleeping: ప్రస్తుత కాలంలో మనిషికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనారోగ్య సమస్యలు మనమే కొనితెచ్చుకుంటున్నాము. నిత్యం మనం సరైన టైముకు..

Before Sleeping: నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే!
Follow us on

Before Sleeping: ప్రస్తుత కాలంలో మనిషికి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అనారోగ్య సమస్యలు మనమే కొనితెచ్చుకుంటున్నాము. నిత్యం మనం సరైన టైముకు భోజనం చేయడం, వ్యాయామం చేయడంతోపాటు తగినన్ని గంటల పాటు కూడా నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం లేదు. దీంతో నిద్రలేమి సమస్య బారిన పడుతున్నారు. అయితే ఎవరైనా సరే.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయరాదు. అవేమిటంటే…

మనం తినే ఆహారంలో కూడా సమయ పాలన పాటించాల్సి ఉంటుంది. సమయ పాలన లేకుండా భోజనం చేస్తే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. రాత్రి పూట భోజనానికి, నిద్రకు కనీసం 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. కొందరు నిద్రించే ముందు భోజనం చేస్తుంటారు. ఇక కొందరు కొవ్వు పదార్థాలు, కారం, మసాలాలు దట్టించిన ఆహారాలను బాగా తిని వెంటనే నిద్రిస్తారు. అలా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. గ్యాస్‌, అసిడిటీ, తలతిరగడం, అధికంగా బరువు పెరగడం, హార్ట్‌ ఎటాక్‌లు రావడం, డయాబెటిస్‌ వంటి సమస్యలు వస్తాయి. కనుక నిద్రించే ముందు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తిండికి, నిద్రకు మధ్య కనీస వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీంతో నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.

మద్యం సేవించి నింద్రించడం వల్ల..

అలాగే మద్యం సేవించి నిద్రించడం వల్ల నిద్రలేమి సమస్య బారిన పడాల్సి వస్తుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే రాత్రి పూట చక్కగా నిద్ర పట్టాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. దగ్గు, జలుబు, అలర్జీల కోసం వేసుకునే మందులు కూడా కొందరిలో నిద్రలేమిని కలిగిస్తాయి. ఆ మందులను డాక్టర్‌ సలహా మేరకు కొంతకాలం పాటు మాత్రమే వాడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఆ మెడిసిన్‌ను వాడితే దీర్ఘకాలికంగా అనేక అనారోగ్య సమస్యలు రావడంతోపాటు నిద్రలేమి సమస్య కూడా వస్తుంది. నిద్రలేమి నుంచి బయటపడాలంటే ఆ మందులను వేసుకోవడం మానేయాలి.

రాత్రుల్లో ఫోన్‌, టీవీ, కంప్యూటర్లకు దూరంగా..

రాత్రి పూట ఫోన్‌, టీవీ, కంప్యూర్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు దూరంగా ఉండాలి. లేదంటే నిద్రలేమి సమస్య బారిన పడడమే కాకుండా ఎన్నో ఆనారోగ్య సమస్యలు దరిచేరుతాయని చెబుతున్నారు. మనం ఇలాంటివి చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Crying Benefits: నవ్వు ఎంత ముఖ్యమో.. ఏడుపు కూడా అంతే ముఖ్యం.. ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలా..?

Heart Attack: మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..? గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువే.. పరిశోధనలలో వెల్లడి