గుండెపోటు(హార్ట్ ఎటాక్) అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఛాతీ నొప్పి. హఠాత్తుగా గుండె వేగం పెరగడం, ఊపిరి ఆడకపోవడం. కానీ గుండెపోటును ముందస్తుగా గుర్తించే మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. ప్రమాదంలో పడతారు. అందుకే గుండెపోటుకు సంబంధించి ఇతర లక్షణాలు కూడా తెలుసుకోవాల్సిన అవశ్యతక ఉంది. మరి ఆ ఇతర లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకు ముందు అధిక కొవ్వు, ఇతర కారణాల వల్ల గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ, ఇప్పుడు లాంగ్ కోవిడ్ ఇన్‌ఫెక్షన్, సరికాని జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో గుండెపోటు బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. జిమ్‌లో కసరత్తు చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు, ఫంక్షన్లలో డ్యా్న్స్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఈ మధ్య భారీగా పెరుగుతోంది. ప్రముఖులు మొదలు.. సామాన్యల వరకు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. దీనికి కారణం.. ధమనుల్లో రక్తం గడ్డ కట్టడం. శరీరంలో ధనమనుల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టిన సంకేతాలు ఉన్నాయా? ఆ సంకేతాలు ఎలా ఉంటాయి? వివరాలు చూద్దాం.
1. సిరల్లో రక్తం గడ్డ కట్టినట్లయితే.. కాలు, చేయి చర్మంపై నీలం, ఎరుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. ఇది చర్మంపై క్లియర్‌గా కనిపిస్తుంది.
2. రక్తం గడ్డకట్టడం వల్ల శరీరంలో రక్తం సరఫరా సాఫీగా సాగదు. రక్తనాళాల్లో వాపు వస్తుంది. ఫలితంగా నొప్పి వస్తుంది.
3. సిరలు, ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఆకస్మికంగా ఛాతిలో నొప్పి వస్తుంది. ఇది కూడా గుండెపోటు లక్షణాల్లో ప్రధానమైనది.
4. గుండెపోటుకు సంబంధించిన ఇతర లక్షణాలు. ఛాతి నొప్పి, చేతలు లాగినట్లుగా ఉండటం, దవడలలో నొప్పి, ఉపిరి అందకపోవడం, ఛాతి నొప్పి, చల్లని చెమట పట్టడం, మూర్ఛ, గుండె వేగం ఆకస్మికంగా పెరగడం జరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..