Health Tips To Reduce Body Heat: ఆధునిక ప్రపంచంలో.. మారుతున్న కాలంతోపాటు అందరూ పలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మన జీవనశైలి, తినే ఆహారం, పరిసరిరాలు, మారుతున్న కాలం ఇలా ప్రతిదీ రోగాల బారిన పడేలా ప్రభావితం చేస్తున్నాయి. వీటితో పాటు కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మనం డిప్రెషన్‌లోకి వెళ్లి.. పలు జబ్బుల బారిన పడేలా చేస్తున్నాయి. అయితే అలాంటి విషయాలను అశ్రద్ధ చేయకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవన్నీ ఒక కారణమైతే.. శరీరంలో అధిక వేడిమి వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయని.. తద్వారా మీరు పలు రోగాల బారిన పడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా వేసవి కాలంలో సాధారణంగానే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. దీనివల్ల వల్ల శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు గురై.. డీహైడ్రేషన్ బారిన పడతారు. దీంతో శరీరంలో అధిక వేడి ఉత్పన్నం కావడం వల్ల తలనొప్పి, మలబద్దకం ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. ఒక్కోసారి ఈ డీహైడ్రేషన్ ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. మరి ఇలాంటి పరిస్థితి రావద్దంటే శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి. మెదడులోని హైపోథాలమస్ శరీరంలోని వేడిని నియంత్రిస్తుందని న్యూరాలజిస్ట్‌లు పేర్కొంటారు. దీంతోపాటు మనం తీసుకునే ఆహారం, ఇతర అలవాట్లతో కూడా శరీరంలో అధిక వేడిని తగ్గించుకోవచ్చు. అందుకే వేడిని తగ్గించేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం వల్ల సమస్యను అధిగమించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
కూర్చునే పరిసరాల్లో… తగినంత ఆక్సిజన్ ప్లాన్ చేసుకోవాలి. ఫ్యాన్, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చుని సేదతీరాలి. లేకపోతే వేడి ఉత్పన్నమవుతుందని పేర్కొంటున్నారు నిపుణులు.
ఒకేచోట గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే కొద్దిసేపు కూర్చున్న తర్వాత లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి.
మణికట్టు, ఛాతీ లాంటి బాగాల్లో చల్లని నీళ్లను, లేక ఐస్‌ను రాస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది.
థైరాయిడ్ ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే శరీరంలో అధిక వేడి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం సైతం పెరుగుతుంది, అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి సలహాలు పాటించాలి.
శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, జ్యూస్ లాంటివి తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
ఒక స్పూన్ మెంతుల్ని తినడంగానీ, లేకపోతే వాటిని పొడిగా చేసి నీళ్లలో కలుపుకుని తాగినా అధిక వేడి నుంచి మీకు ఉపశనమనం లభిస్తుంది.
ఈత కొట్టడం వల్ల, స్నానం చేయడం వల్ల కూడా ఉష్ణోగ్రత కొద్దిమేర తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: