Breast Cancer: పెరుగుతున్న రొమ్ము క్యాన్సన్‌ బాధితులు.. చికిత్స లేకుండానే నివారించవచ్చు..!

Breast Cancer: వయసు పెరుగుతున్న కొద్ది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జీవన శైలి, వయసు మీదపడటం, ఇతర తగినంత శక్తి లేకపోవడం..

Breast Cancer: పెరుగుతున్న రొమ్ము క్యాన్సన్‌ బాధితులు.. చికిత్స లేకుండానే నివారించవచ్చు..!

Updated on: Jan 22, 2022 | 7:36 AM

Breast Cancer: వయసు పెరుగుతున్న కొద్ది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జీవన శైలి, వయసు మీదపడటం, ఇతర తగినంత శక్తి లేకపోవడం తదితర కారణాల వల్ల ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి రొమ్ము క్యాన్సర్‌ కూడా బాధిస్తుంటుంది. ఇప్పుడున్న వైద్య రంగంలో అనేక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి చికిత్స లేకుండా రొమ్ముక్యాన్సర్‌ను నయం చేసుకోవచ్చని హైదరాబాద్‌ యశోద ఆస్పత్రి మెడికల్‌ ఆంకాలజిస్టు, హెమటో ఆంకాలజిస్టు డాక్టర్‌ నిఖిల్‌ చెబుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని, ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది.. అలాంటి సమయంలో ముందు జాగ్రత్తగా చికిత్స అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చుంటున్నారు.

మద్యానికి దూరం

రొమ్ము క్యాన్సర్‌కు పెద్ద శత్రువు మద్యం. ఇటీవల కాలంలో స్త్రీలలోనూ మద్యం అలవాటు అనేది పెరిగిపోతోంది. ఈ కారణంగా వివిధ క్యాన్సర్ల బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. మద్యానికి సాధ్యమైనంత దూరంగా ఉండటం ఎంతో మేలు. అలాగే ధూమపానంకు కూడా దూరంగా ఉండటం మంచిదంటున్నారు.

ఊబకాయంతో ప్రమాదం..

రొమ్ము క్యాన్సర్‌కు ఊబకాయం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఊబకాయం ఉన్న వారికి రొమ్ము క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని, బరువును తగ్గించుకోవడం ఎంతో మేలంటున్నారు. ఈ విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం ఎంతో మంచిది.

వ్యాయామాలు:

ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు ఎంతో ముఖ్యం. ప్రతి రోజు వ్యాయమం చేస్తుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్‌ సహా వివిధ ఆరోగ్య సమస్యల ముప్పునూ తగ్గిస్తుంది.

తల్లిపాలది కీలకం:

రొమ్ము క్యాన్సన్‌ను తగ్గించడంలో తల్లి పాలదీ కీలకమంటున్నారు. తల్లి తన పిల్లలకు ఎంత ఎక్కువ కాలం చనుబాలిస్తే, అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

పోషకాహారాల వల్ల..

పోషకాహారాల వల్ల కూడా వివిధ రకాల క్యాన్సర్లతో పాటు మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం, ఇతర వ్యాధుల నుంచి ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. పండ్లు, మంచి ప్రొటీన్స్‌ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Children Parosmia: మీ పిల్లలు ఆహారం సరిగ్గా తినడం లేదా..? ఈ సమస్య కావచ్చు..!

Diabetes: మధుమేహం ఉంటే పండ్లు తినొచ్చా.. తింటే ఎలాంటివి ఎంచుకోవాలి.. నిపుణులు ఏమంటున్నారంటే?

Loading...
Unable to load recommendations.
Follow Us