Health Tips: దోసకాయ, కొత్తిమీర జ్యూస్‌తో బోలెడు లాభాలు.. డీ హైడ్రేషన్‌కి చక్కటి పరిష్కారం..!

|

Apr 16, 2022 | 12:15 PM

Health Tips: వేసవిలో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్,

Health Tips: దోసకాయ, కొత్తిమీర జ్యూస్‌తో బోలెడు లాభాలు.. డీ హైడ్రేషన్‌కి చక్కటి పరిష్కారం..!
Cucumber Coriander Juice
Follow us on

Health Tips: వేసవిలో దోసకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రజలు అనేక విధాలుగా దోసకాయను తింటారు. అంతేకాదు దోసకాయ, కొత్తిమీర కలిపి జ్యూస్‌ తయారు చేసుకోవచ్చు. ఈ జ్యూస్‌ ప్రత్యేకత ఏంటంటే బరువు తగ్గాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

నీటి కొరత తీరుతుంది

దోసకాయ, కొత్తిమీరతో తయారు చేసిన జ్యూస్‌ ఉదయం లేదా మధ్యాహ్నం తాగాలి. వేసవిలో వివిధ పనుల కోసం బయటకి వెళుతారు. ఆ సందర్భంలో ఈ జ్యూస్‌ తాగి వెళితే చాలా మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. తరచూ దాహం వేయకుండా కాపాడుతుంది.

బరువు తగ్గడానికి మేలు చేస్తుంది

వేసవిలో బరువు తగ్గాలనుకుంటే క్రమం తప్పకుండా దోసకాయ, కొత్తిమీరతో తయారు చేసిన జ్యూస్‌ని తీసుకోవచ్చు. ఇందులోని పెద్ద విశేషం ఏంటంటే ఈ జ్యూస్‌ తాగడం వల్ల శరీరానికి పోషకాల కొరత ఏర్పడదు. సులువుగా బరువు తగ్గుతారు. ఇది మైకం, లో బీపీ వంటి సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

కాంతివంతమైన చర్మం

వేసవిలో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలంటే నీరు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకోవడం ముఖ్యం. దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా దీని వినియోగం చర్మానికి మేలు చేస్తుంది. దోసకాయ, కొత్తిమీర జ్యూస్‌ రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

SBI Special Offer: ఎస్బీఐ ఖాతాదారులకి బంపర్‌ ఆఫర్.. వాటికోసం ప్రత్యేక రుణం..!

Hanuman jayanti 2022: హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు మరిచిపోయి కూడా ఈ తప్పులు చేయకండి..!

IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!