Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెసర్లను అస్సలు తినొద్దు.. కాదంటే కష్టాలు తప్పవు మరి..!

|

Sep 15, 2022 | 6:54 AM

Health Tips: హెల్తీ ఫుడ్ లిస్ట్‌లో పప్పు దినుసులదే మొదటి ప్లేస్. వీటిల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పప్పుదినుసులకు ఆరోగ్యపరంగా

Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పెసర్లను అస్సలు తినొద్దు.. కాదంటే కష్టాలు తప్పవు మరి..!
Moong Dal Side Effects
Follow us on

Health Tips: హెల్తీ ఫుడ్ లిస్ట్‌లో పప్పు దినుసులదే మొదటి ప్లేస్. వీటిల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పప్పుదినుసులకు ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోనూ పెసలు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని, వీటిని సాధారణ కూర మాదిరిగానే కాకుండా.. మొలకల రూపంలోనూ తీసుకోవాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇక్క చిన్న షరతు పెడుతున్నారు వైద్యుల. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెసలతో చేసిన మొలకలు తినకూడదని చెబుతున్నారు. మరి వీటిని ఎందుకు తినకూడదు? తింటే ఏం జరుగుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. తక్కువ రక్తపోటు(బ్లడ్ ప్రెజర్): రక్తపోటు తక్కువగా ఉంటే.. అది పెరిగేందుకు బెండకాయ తినాలని వైద్యులు సూచిస్తారు. అయితే, పరిస్థితి తారుమారు అయితే, బెండకాయ తినకూడదు. లేదంటే కొత్త సమస్యలు తలెత్తడం ఖాయం. ఇదే విధానం పెసర్లకు కూడా వర్తిస్తుంది.

2. కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కొనేవారు ఎప్పుడూ పెసర్లకు దూరంగా ఉండాలి. ఇందులో షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.

3. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు బలహీనత, మైకంగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తారు. వీరు పెసరపప్పు తినడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని మరింత తగ్గిస్తుంది. మూర్ఛపోయే పరిస్థితి రావొచ్చు.

4. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు పెసర పప్పు తినడం మానుకోవాలి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. కీళ్ళు నొప్పులు ప్రారంభమవుతాయి. కావున జాగ్రత్తగా ఉండటం అవసరం. కాదని పెసరపప్పు తింటే ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..