Heart Problems: ఆధునిక జీవితంలో మనుషులను ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు. ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. గుండె జబ్బులు కేవలం వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా అధికమయ్యాయని పేర్కొంటున్నారు. కరోనా కాలం కారణంగా జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది. బయటకు వెళ్లకుండా చాలామంది ఇళ్లల్లోనే ఉంటారు. దీని కారణంగా శారీరక శ్రమ కూడా తగ్గింది. ఈ క్రమంలో ఒకే చోట కొన్ని గంటలు పనిచేయడం, జంక్ ఫుడ్ తీసుకోవడం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో గుండె జబ్బుల బారిన పడకుండా జీవన, ఆహార శైలిని మార్చుకొని.. కొన్ని పద్దతులను పాటిస్తే ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అసలు గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
ఒత్తిడి
ఒత్తిడి కారణంగా.. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, హృదయ స్పందన పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. దీని కారణంగా గుండె కండరాలు బలహీనపడి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి.
ధూమపానం
ధూమపానం చేసేవారికి కొరోనరీ ఆర్టరీ వ్యాధి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె జబ్బులతో మరణించిన ప్రతి ఐదుగురిలో.. ఒకరు ధూమపానానికి సంబంధించిన వారే ఉన్నారు. అధికంగా ధూమపానం చేసేవారికి గుండె ప్రమాదం చాలా ఎక్కువ.
జీవనశైలి
జీవనశైలి కూడా అనేక రకాల వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అందుకే ఆరోగ్యకరమైన హృదయం కోసం.. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతోపాటు గుండె జబ్బులు పెరుగుతాయి.
ఎక్కువ గంటలు పని
ఎక్కువ గంటలు పనిచేయడం కూడా ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ కారణంగా, నిద్రలోపం, మానసిక ఆరోగ్య సమస్యలతోపాటు గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. పనివేళల్లో మధ్యమధ్యలో విరామం తీసుకుంటుండాలి. సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి.
అర్థరాత్రి నిద్ర
రాత్రివేళ సమయానికి పడుకోవాలి. ఎప్పుడో అర్థరాత్రి వేళ నిద్రపోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మంచి ఆరోగ్యం కోసం 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి.
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్ తినడం వల్ల కేలరీలు, చెడు కొలెస్ట్రాల్ అమితంగా పెరుగుతాయి. ఇలా నిరంతరం తినడం వల్ల బరువు పెరగుతారు. అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: