Health Tips: వీటితో కలిపి బొప్పాయి అస్సలు తినకూడదు.. ఎందుకంటే.?

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కెరోటిన్, విటమిన్ ఏ, బీ, సీ, ఈ అలాగే ఖనిజాలు..

Health Tips: వీటితో కలిపి బొప్పాయి అస్సలు తినకూడదు.. ఎందుకంటే.?
Papaya Benefits

Updated on: Jun 07, 2023 | 11:44 AM

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కెరోటిన్, విటమిన్ ఏ, బీ, సీ, ఈ అలాగే ఖనిజాలు, ఫ్లేవోనాయిడ్స్, ఫొలేట్‌లు, పాంతోనిక్ ఆమ్లాలు, పీచు వంటివి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే బొప్పాయితో పాటు కొన్ని పదార్ధాలు కలిపి తింటే దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి అదేంటో తెలుసుకుందామా..

  • దోసకాయ:

బొప్పాయితో పాటు దోసకాయను కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు తిమ్మిరి, విరేచనాలు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెండింటిలోనూ నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరంలోకి అధిక నీరు చేరి విరేచనాలకు దారి తీస్తాయి.

  • ద్రాక్ష:

బొప్పాయితో పాటు ద్రాక్షపండు అస్సలు తినకూడదు. దాని వల్ల పొట్టలో ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడవచ్చు. ద్రాక్షలో ఆమ్లా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణసంబంధ సమస్యలకు దారి తీస్తుంది.

  • పాల ఉత్పత్తులు:

బొప్పాయితో పాటు పాల ఉత్పత్తులు ఏవైనా కూడా అస్సలు తినకండి. పాలు, జున్ను, వెన్న, పెరుగు లాంటి పాల ఉత్పత్తులను బొప్పాయితో కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు తిమ్మిరి కూడా రావచ్చు.

  • ఫ్రైడ్ ఫుడ్:

బొప్పాయితో వేయించిన ఆహారాన్ని అస్సలు తినకండి. వీటిల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఆ ఫ్రైడ్ ఫుడ్‌ను బొప్పాయితో తినడం వల్ల అజీర్ణం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి.

  • సిట్రస్ పండ్లు:

బొప్పాయితో పాటు సిట్రస్ పండ్లు కలిపి ఎప్పుడూ తినొద్దు. పులుపు అధికంగా ఉండే ఈ పండ్లలో విటమిన్ సీ శాతం ఎక్కువగా ఉంటుంది. అటు బొప్పాయిలో కూడా విటమిన్ సి అధిక స్థాయిలో ఉండటం వల్లఎసిడిటీ, గుండెల్లో మంట లాంటివి వస్తాయి.

  • టమోటా:

బొప్పాయి, టమోటా కలిపి తినొద్దు. ఈ రెండింటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అటు బొప్పాయి, ఇటు టమోటాలో అధిక ఆమ్లా ఉంటుంది. దీని వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట రావచ్చు.

  • మసాలా ఆహారం:

బొప్పాయితో మసాలా ఫుడ్‌ను కలిపి తినకూడదు. ఈ రెండింటిని తినడం వల్ల కడుపు తిమ్మిర్లు, ఉబ్బరం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.