బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదంపప్పుల్లో అధిక పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అనేక రకాలుగా తినవచ్చు. కానీ వీటిని తినడానికి ఉత్తమ మార్గం రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. మరి నానబెట్టిన బాదం పప్పును తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు బాదం పప్పు తినడం ఉత్తమం. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గడించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
బాదం పప్పులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఎల్‌డీఎల్ ను తగ్గించి, హెచ్‌డీఎల్‌ను పెంచుతుంది. బాదం పప్పులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులో యాంటీఆక్సీడెంట్స్, ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు తగ్గడంలో బాదం పప్పు సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది మీ కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు.
బాదం పప్పులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ తో సహా అనేక పోషకాలు ఉన్నాయి. వీటిని రాత్రి నానబెట్టి, ఉదయాన్నే తినడం వలన ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.
బాదం పప్పు తినడం వలన బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. బాదంలో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్స్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..