Mouth Ulcer Home Remedies: నోటిపూత రావడానికి మనం తీసుకునే ఆహారం ప్రధాన కారణం కావచ్చు. సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. నోటి అల్సర్ల (Mouth Ulcer) నుంచి ఉపశమనం పొందాలంటే.. వైద్యులను సంప్రదించడం ఉత్తమం. అయితే నోటి అల్సర్ల నుంచి ఉపశమనం పొందాలన్నా.. తీవ్రగా తగ్గాలన్నా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలని పేర్కొంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా నోటి పూత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. (Health Tips) అవేంటో ఇప్పుడు తెలుసుకోండి…
పెరుగు: పెరుగు నోటిపూత నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అల్సర్లు ఏర్పడిన చోట చల్లగా చేస్తుంది. నోటిలో పొక్కులు వచ్చినప్పుడు పెరుగు తినమని వైద్యులు కూడా సలహా ఇస్తారు. మధ్యాహ్నం ఒక గిన్నె పెరుగు తింటే నోటికి చాలా ఉపశమనం కలుగుతుంది.
అలోవెరా జ్యూస్: ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నోటి అల్సర్‌లను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. మీకు కావాలంటే అలోవెరా జెల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా అల్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం.
లవంగం నూనె: పంటి నొప్పి సమయంలో లవంగం నూనెను చాలా కాలం పాటు ఉపయోగించమని సలహా ఇస్తారు వైద్యులు. నోటిలో పుండ్లు పోవాలంటే లవంగాలను మెత్తగా చేసి నూనెలో వేడి చేయాలి. నూనె చల్లారిన తర్వాత కాటన్ సహాయంతో పొక్కులపై రాయాలి. కావాలంటే మార్కెట్‌లో లభించే లవంగం నూనెను కూడా ఉపయోగించవచ్చు
ఆరెంజ్ జ్యూస్: దీని రసం నోటి అల్సర్ల నుండి రక్షించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. నిజానికి పొట్టకు సంబంధించిన సమస్యల వల్ల కూడా నోటిలో పూత ఏర్పడుతుంది. కడుపు సరిగ్గా ఉంటే జీవ క్రియ సాఫిగా జరిగితే నోటి పూత ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని నూటి పూతనుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తులసి ఆకులు: ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న తులసి ఆకులు నోటిపూతను దూరం చేస్తాయి. కొన్ని తులసి ఆకులను కడిగి నోటిలో ఉంచుకుని కొద్దిసేపు నెమ్మదిగా నమలండి. నమలిన తర్వాత వాటి రసాన్ని మింగాలి. దీని నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా నోటి అల్సర్ల నుంచి బయటపడటంతోపాటు.. నోటి వాసన కూడా దూరమవుతుంది.
Also Read: