Mushroom Facts: పుట్టగొడుగుల గురించి మీకు ఎంతవరకు తెలుసు.. కూర వండుకోవడానికి మాత్రమే కాదు.. అంతకు మించి..

|

Feb 24, 2021 | 5:00 AM

Mushroom Facts: రోజు తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడూ పుట్టగొడుగులు చేర్చడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది.

Mushroom Facts: పుట్టగొడుగుల గురించి మీకు ఎంతవరకు తెలుసు.. కూర వండుకోవడానికి మాత్రమే కాదు.. అంతకు మించి..
Follow us on

Mushroom Facts: రోజు తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడూ పుట్టగొడుగులు చేర్చడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.

పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది.

పుట్టగొడుగులను వివిధ రకాల వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. వీటిని సూప్ మరియు సలాడ్లలో ఉపయోగిస్తారు, గుడ్లు వంటి ఇతర ఆహార పదార్థాలతో, ఆకలిని ప్రేరేపించడానికి, శాండ్‌విచ్‌లలో ఇతర కూరగాయలతో పాటు కలుపుతారు మరియు పిజ్జాల కోసం పాస్తా సాస్ మరియు టాపింగ్స్‌ను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి మరియు పొటాషియం మరియు సోడియం యొక్క మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

Health News: రోజూ కాఫీ తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. ప్రయోజనాలను తెలుకుందాం..