Jujube Health Benefits: భానుడికి చిహ్నంగా భావించే ఈ రేగు పండులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..!

|

Jan 20, 2021 | 5:33 PM

ఏ సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు ఆ సీజన్లో తినాలని.. వాటిని అసలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. వాటిలో సీజనల్ వ్యాధులను నివారించే...

Jujube Health Benefits: భానుడికి చిహ్నంగా భావించే ఈ రేగు పండులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..!
Follow us on

Jujube Health Benefits: మనిషి జీవితం ప్రకృతితో ముడిపడి ఉంది. మన ఆరోగ్యం, మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కాలానికి అనుగుణంగా ఉంటే సగం రోగాలకు దూరంగా ఉన్నట్లే.. అందుకనే ఏ సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు ఆ సీజన్లో తినాలని.. వాటిని అసలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. వాటిలో సీజనల్ వ్యాధులను నివారించే పోషకాలుంటాయని అంటున్నారు.  శీతాకాలంలో దొరికే రేగు పండ్లు తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన చక్కటి పోషకాలు అందించడంలో రేగుపండ్లు ఉపయోగపడతాయి. చూడడానికి చిన్నవే.. కానీ ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. రేగు పండు తీయని పండే కాదు మంచి హెర్బల్‌ మందుగా కూడా పనిచేస్తుంది.

రేగు పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుంటుంది. వీటిని భానుడికి చిహ్నంగా భావిస్తారు. సంక్రాంతి సమయంలో భోగి రోజున పిల్లలు భోగభాగ్యాలతో తులతూగాలని ఈ పండ్లను పోస్తారు. భోగినాడు పోస్తారు కాబట్టి వీటిని భోగిపండ్లు అంటారు. రేగు పళ్లకు రకరకాల పేర్లున్నాయి

రేగు పండ్లు తరచూ జ్వరం, జలుబు రాకుండా చేస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ఆంతేకాదు గుండె ఆరోగ్యంగా ఉండే విధంగా మినరల్స్‌ను అందిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిల్ తక్కువ గా ఉన్నవారికి రేగు పండ్లు మంచి హెల్తీ పండు. అంతేకాదు రక్త సరఫరా జరగడానికి రేగు పండ్లలో ఉన్న ఐరన్ ఉపయోగపడుంది. కీళ్లకి సంబందించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగిపండ్లు ఒత్తిడి తగ్గించడంతోపాటు మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. రేగుపండ్లు చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగు పండు మంచి ఆహారం మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు రేగు పండు దోహదపడుతుంది.

ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు. కొవ్వు ఉండదు, ఇందులో ఉండే కెలరీలు చాలా తక్కువ.. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల ఆమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలోనే లభిస్తాయి. వీటితో కడుపుమంట, ఆజీర్తి, గొంతునొప్పి, అస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణుల్లో ఉండే వికారాలను వాంతులు, తగ్గిస్తుంది. వెంట్రుకలు పెరగడానికి రేగుపండ్లు దోహదం చేస్తాయి. వేళ్లతో, బెరడుతో చేసిన రసం కీళ్లవాతానికి బాగా పనిచేస్తుంది.

ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా వుండేందుకు దోహదపడతాయి. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవారు ఈ పండ్లు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. తక్కువ ధరతో శరీరానికి అవసరమయ్యే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది ఈ రేగు పండు.. కనుక వయస్సుతో సంబంధం లేకుండా శీతాకాలంలో దొరికే ఈ పండును తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఈనెల 30న జాతీయ అమరవీరుల సంస్మరణదినం.. దేశప్రజలందరూ 2 ని. మౌనం పాటించాలని కేంద్రం పిలుపు