Flax Seed-flax leaves: చర్మం సౌందర్యాన్ని పెంచి.. అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాల గని ‘అవిసె’ మొక్క..

Flax Seed-flax Leaves Health Benefits: అవిసె మొక్క గ్రామీణ వాసులకు తెలిసిన మొక్క.. అనేక ఔషధాలు కలిగిన అవిసె మొక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తెలుగులో మదనగింజలు,..

Flax Seed-flax leaves: చర్మం సౌందర్యాన్ని పెంచి.. అందం, ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధాల గని అవిసె మొక్క..
Avise

Updated on: Sep 23, 2021 | 9:09 AM

Flax Seed-flax Leaves Health Benefits: అవిసె మొక్క గ్రామీణ వాసులకు తెలిసిన మొక్క.. అనేక ఔషధాలు కలిగిన అవిసె మొక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తెలుగులో మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా ఆంటారు. ఈ అవిసె చెట్టు ఆకులు, పువ్వులు, చెక్కలు, వేర్లల్లో ఆయుర్వేద గుణాలున్నాయి.  అవిసె ఆకును వండుకుని తినడం ద్వారా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. అవిసె ఆకు , బెరడు, పువ్వు చేదుగా ఉంటాయి. వీటి రసం వేడి చేస్తుంది. అయితే దీని మహాశక్తి వలన కఫ రోగాలు , క్రిమి రోగాలు , పైత్య జ్వరాలు , రక్త పైత్యం , సర్ఫవిశం హరిస్తుంది. అతి కొవ్వుని తగ్గించి శరీరాన్ని నాజుకుగా చేస్తుంది. ఈరోజు అవిసె తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

శరీర సౌందర్యానికి: అవిసె పూలను.. నీడలో ఆరబెట్టి దంచి జల్లించి నిలువ చేసుకోవాలి. స్నానం చేసే ముందు ఈ పొడిలో పాలను కలిపి.. కొంచెం వెన్నె వేసుకుని.. ఈ మిశ్రమాన్ని శరీరానికి నలుగు పిండిలా అప్లై చేసుకుని తర్వాత స్నానం చేస్తే.. నలుపు రంగు క్రమేపి తగ్గి.. చక్కని మేని ఛాయ సొంతమవుతుంది.

గవద బిళ్లలకు : అవిశాకు .. కొంచెం గుల్ల సున్నం కలిపి నూరి .. ఆ మిశ్రమాన్ని గవద బిళ్ళపైన అద్దితే.. క్రమేపీ గవద బిళ్ళలు కరిగిపోతాయి.

సుఖ విరేచనానికి: అవిశ ఆకుతో వంటి కూర తినడం వలన సుఖవిరేచనం కావడమే కాదు.. పొట్ట మొదలయిన చోట్ల అతిగా పెరిగిన కొవ్వు మొత్తం కరిగి .. నడుము సన్నగా తయారవుతుంది.

పార్శ్వపు తలనొప్పి తో ఇబ్బంది పడుతున్నవారు అవిసె గింజలు,  ఆవాలు సమానంగా  తీసుకుని మంచినీటితో మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తల కణతల పై పట్టులాగా వేసి పైన కాగితం అంటించాలి. తరువాత ఇటుక పొడిని వేయించి బట్టలో మూటకట్టి దానితో కాపడం పెడితే ఎంతటి పార్శ్వపు నొప్పిఅయినా తగ్గుతుంది.

మూత్ర పిండాల రక్షణ కోసం: మూత్రపిండాలు పాడైన వారు, మూత్ర వ్యాధులతో బాధపడేవారికి అవిసె మంచి ఔషధం.. అవిసె గింజలని దొరగా వేయించి వాటిలో గింజల్లో సంగం కొలతల్లో చక్కర పొడి కలిపి రోటిలో వేసి బాగా మెత్తగా అయ్యేంతవరకు దంచాలి. తర్వాత దీనిని లడ్డుల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డు ఉండలను రోజూ ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందుతింటే మూత్ర పిండాల సమస్యలు తగ్గుతాయి.

సెగ గడ్డల నివారణకు: అవిసె గింజలు , పసుపు కొమ్ములు సమంగా తీసుకుని మెత్తగా నూరి గడ్డలపై వేసి కట్టుకడితే.. మూడురోజుల్లో గడ్డలు పగిలిపోయి పుండు మాడిపోతుంది.
ఉబ్బసానికి – ఉధృతమైన యోగం –

రేచీకటి తగ్గడానికి: ప్రతి రోజు అవిసె పూలను గాని, మొగ్గలను గాని కూరగా వండుకొని అన్నంలో కలుపుకుని వరసగా 21 రోజులు తింటే రేచీకటి రోగం హరించి పొతుంది.

పొట్ట తగ్గడానికి : అవిసె గింజలని , ఆముదం గింజలను సమానంగా తీసుకుని.. ఆముదం గింజలను పగలగొట్టి పెచ్చులను తీసివేసి లొపలి పప్పుతో పాటు అవిసె గింజలని కలిపి తగినన్ని నీటితో మెత్తగా ముద్దలాగా కొంచం పలచగా ఉండేలా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడుపు పైన పట్టు లాగా వేయాలి . ఇదే మిశ్రమం కొవ్వుతో ఏర్పడిన పొట్టతో పాటు.. బల్లరోగం ఉన్నవారికి కూడా దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది.

ఉదరసంబంధ వ్యాధులకు : శుభ్రపరిచిన అవిసె ఆకులతో చిన్నపాటి ఉల్లిపాయలు, మిరియాలు, జీలకర్ర చేర్చి సూప్‌లా తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత రుగ్మతలను తొలగించుకోవచ్చు.

చర్మ వ్యాధులకు: అవిసె ఆకుల రసాన్ని చర్మంపై దద్దుర్లపై రాస్తే.. ఉపశమనం లభిస్తుంది. చర్మ సమస్యలున్న ప్రాంతంలో అవిసె ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో వేయించి.. పేస్టులా తయారు చేసుకుని రాస్తే మంచి ఫలితం వుంటుంది.

Also Read:  గర్భిణీ స్త్రీలల్లో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంత కోసం.. సుఖ ప్రసవం కోసం యోగాసనాలు ఏమింటే..