
బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో కణాలను రక్షించడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ వండటం కొంచెం సమయం పట్టినా దీని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం మంచిది.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్‌లో ఉండే లిగ్నాన్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
బ్రౌన్ రైస్ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా అన్నవాహిక, కడుపు, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటివి తగ్గుతాయి. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరగాలి.
చాలా మంది బరువు తగ్గడానికి అన్నం తినడం మానేస్తారు. కానీ బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్‌లోని ఫైబర్ కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల ఆకలి తక్కువగా ఉంటుంది. ఇది బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. దీనివల్ల శరీర కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. వాపులు తగ్గుతాయి.
బ్రౌన్ రైస్‌లో మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మంచిది. ఎముకలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.
బ్రౌన్ రైస్ డయాబెటిక్ పేషెంట్లకు మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైనది.
బ్రౌన్ రైస్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది.
కొంతమందికి బ్రౌన్ రైస్ అలర్జీ ఉండవచ్చు. అలాంటివారు బ్రౌన్ రైస్ తినకూడదు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా బ్రౌన్ రైస్ తక్కువగా తినాలి. ఎందుకంటే ఇందులో ఆర్సెనిక్ అనే మూలకం ఉంటుంది. ఇది ఎక్కువైతే హాని చేస్తుంది.
బ్రౌన్ రైస్ వండడం కొంచెం కష్టం. ఎందుకంటే ఇది వైట్ రైస్ కంటే ఎక్కువ సమయం పడుతుంది. బ్రౌన్ రైస్‌లో ఉండే పొరలు తొలగించబడవు. అందువల్ల ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)