థైరాయిడ్.. నూటికి 80 శాతం మందిని వేధిస్తున్న సమస్య. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి కాదు. శరీరంలో కొన్ని హార్మోన్ల లోపం కారణంగా తలెత్తే సమస్య. కొందరు థైరాయిడ్ కారణంగా విపరీతంగా బరువు పెరిగితే.. కొందరు అదేరీతిన బరువు తగ్గుతారు. థైరాయిడ్ కు పరగడుపునే వేసుకునే ట్యాబ్లెట్ చాలా ముఖ్యమైనది. దీనిని ఒక్కరోజు మరిచిపోయినా.. ఆరోజు దినచర్యల్లో చాలా మార్పులు వచ్చేస్తాయి. చేసే పనిపై దృష్టిసారించలేరు.
థైరాయిడ్ ను తగ్గించుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతుంటారు. అది కొంచెం కంట్రోల్ అయిందనగానే చాలా మంది కేర్ తీసుకోవడం మానేస్తారు. ఫలితంగా అనూహ్యంగా బరువు పెరగడం, అలసట ఎక్కువగా ఉండటం, మాట్లాడేటపుడు ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
అంతేకాదు.. మహిళల్లో పీసీఓడీ పెరగడం, నరాల వాపులు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, విపరీతమైన నడుం నొప్పి, పడుకుని లేవగానే ముఖం ఉబ్బిపోవడం, అధిక నిద్ర, థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరగడం వంటి అనూహ్య మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. అందుకే థైరాయిడ్ కంట్రోల్ అయిందని.. వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోకుండా మీకు మీరుగా మందులను వాడటం ఆపవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే తగ్గిన రోగాన్ని చేజేతులా మళ్లీ ఆహ్వానించినట్లే అవుతుందని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి