Fenugreek: నేటి కాలంలో చుండ్రు సమస్య చాలా మందిని వేధిస్తోంది. తలలో దురదతో పాటు చాలా సమస్యలు ఉంటాయి. కొన్నిసార్లు ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. తలలో నిరంతరం దురద ఉండటం వల్ల వెంట్రుకల వేర్లు బలహీనంగా మారతాయి. అంతేకాదు జుట్టు రాలిపోతుంది. చుండ్రు బట్టలపై, చర్మంపై కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో దీనికి చికిత్స చేయడం అవసరం. కాబట్టి కొన్ని నివారణల గురించి తెలుసుకుందాం.
మెంతులు, నిమ్మకాయ
మెంతి గింజలను ఒక గిన్నెలో రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో కడగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య కనిపించదు.
మెంతి గింజలు, అలోవెరా జెల్
మెంతి గింజలను ఒక గిన్నె నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానికి తాజా అలోవెరా జెల్ కలపాలి. ఈ పేస్ట్‌ను మీ స్కాల్ప్, హెయిర్‌పై బాగా అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత షాంపూ సహాయంతో జుట్టును కడగాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి