Ghee Benefits
నెయ్యి అనేది చాలా మందికి ఇష్టమే. కానీ కొందరికి పెద్దగా ఇష్టం ఉండదు. కానీ నెయ్యితో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే తినే అలవాటు లేని వాళ్లు కూడా అలవాటు చేసుకుంటారు. నెయ్యి రుచి, వాసనను పెంచడమే కాకుండా.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి. అనేక ప్రయోజనాలు ఉన్న కారణంగా నెయ్యిని ద్రవ బంగారం అని కూడా పిలుస్తారు. మీ రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యితో ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..
- రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర: నెయ్యి రోగనిరోధక శక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేశీ నెయ్యిలో యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడటంతో ఎంతగానో సహాయపడుతుంది.
- ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తింటే: నెయ్యి తినడం వల్ల మన జీర్ణ శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే పదార్థాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి. ఇది కణాలు, కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తినడం వల్ల కణాల పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడుతుంది.
- ప్రకాశవంతమైన చర్మం: నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా, చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి చర్మం, జుట్టుకు ప్రకాశాన్ని తెస్తుంది.
- నెయ్యిలో ఒమేగా కొవ్వు ఆమ్లాలు: అలాగే, నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. గుండె ఆరోగ్యంగా, ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి