మహిళలూ ఇది మీకే.. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా..? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..

|

May 14, 2024 | 4:33 PM

ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకే ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రస్తుత కాలంలో ఎన్నో వ్యాధులు వెంటాడుతున్నాయి. కావున.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మన శరీరంలో కొన్ని ప్రత్యేక అవయవాలు ఉన్నాయి.. వాటి పనితీరు ఏ మాత్రం మందగించినా లేదా వాటికి ఆటంకం ఏర్పడినా వ్యక్తి తట్టుకోవడం కష్టం..

మహిళలూ ఇది మీకే.. పిత్తాశయంలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా..? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం..
Gallstones Symptoms
Follow us on

ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకే ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ప్రస్తుత కాలంలో ఎన్నో వ్యాధులు వెంటాడుతున్నాయి. కావున.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.. మన శరీరంలో కొన్ని ప్రత్యేక అవయవాలు ఉన్నాయి.. వాటి పనితీరు ఏ మాత్రం మందగించినా లేదా వాటికి ఆటంకం ఏర్పడినా వ్యక్తి తట్టుకోవడం కష్టం.. అటువంటి అవయవాల్లో పిత్తాశయం ఒకటి.. జీర్ణవ్యవస్థలో పిత్తాశయం ఒక ముఖ్యమైన భాగం. ఇది పిత్త వాహిక ద్వారా కాలేయం.. చిన్న ప్రేగులకు అనుసంధానించబడి ఉంటుంది. కొవ్వును జీర్ణం చేసే ఒక ప్రత్యేక రకం ఎంజైమ్ కాలేయంలో ఉత్పత్తి అవుతుంది. దీనినే పిత్తం అంటారు. కాలేయం నుంచి ఇది పిత్త వాహిక ద్వారా గాల్ బ్లాడర్‌లో జమ అవుతుంది.

పిత్తాశయంలో రాళ్లకు కారణాలు..

ప్రస్తుతకాలంలో పిత్తాశయంలో రాళ్లు చాలా సాధారణ వ్యాధిగా మారాయి. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇది జరుగుతుంది. సాదారణంగా స్టోన్ గురించి వినగానే ప్రజలు చాలా తరచుగా భయాందోళనలకు గురవుతారు. రాళ్లకు సకాలంలో చికిత్స చేస్తే, మీరు ఈ వ్యాధిని వదిలించుకోవచ్చు. కానీ పదే పదే నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన వ్యాధిగా రూపం దాల్చుతుంది.

ఆహారంలో ఉన్న కొవ్వును జీర్ణం చేయడానికి, పిత్త వాహిక పిత్తాశయం ద్వారా చిన్న ప్రేగులోకి వెళుతుంది. కొన్నిసార్లు ఈ పిత్తాశయం (గాల్ బ్లాడర్) లో రాళ్లు క్రమంగా ఏర్పడటం ప్రారంభిస్తాయి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

పిత్తాశయంలో కాల్షియం – ఖనిజాలు చేరడం వల్ల రాళ్లు ఏర్పడతాయా?

పిత్తాశయంలో కాల్షియం, మినరల్స్ చేరడం వల్ల రాళ్లు ఏర్పడటం ప్రారంభమవుతుందని చాలా మందికి అపోహ ఉంది. కానీ చాలా పరిశోధనలు దీనిని పూర్తిగా కొట్టిపారేస్తున్నాయి. పరిశోధనల ప్రకారం.. గాల్ బ్లాడర్‌లో కొలెస్ట్రాల్ అధికంగా చేరడం వల్ల రాళ్ల సమస్య ఏర్పడుతుంది.

40 ఏళ్లు పైబడిన మహిళలు, ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో పిత్తాశయంలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం తర్వాత రాళ్ల సమస్య తరచుగా సంభవిస్తుంది. పిత్తాశయం నుంచి రాళ్ళు పిత్త వాహికలోకి ప్రవేశిస్తే.. అది కామెర్లు.. ప్యాంక్రియాస్‌లో వాపు వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యాధికి ఎక్కువ కాలం చికిత్స చేయకపోతే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం కావచ్చు.

పిత్తాశయంలో రాళ్ల లక్షణాలు..

  • కడుపు కుడి వైపున తీవ్రమైన నొప్పి
  • ఆకలి వేయకపోవడం
  • వాటి వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు, రుగ్మతలు
  • కడుపులో అధిక వాయువు.. ఉబ్బరంగా ఉండటం..
  • వికారం, వాంతులు.. నీరసంగా ఉండటం

గాల్ బ్లాడర్ నివారించాలంటే ఈ పనులు చేయండి..

ఆహారంలో నూనె, మసాలాలు ఎక్కువగా వాడితే రాళ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఆహారంలో నెయ్యి, నూనె, సుగంధ ద్రవ్యాలు తక్కువగా వాడాలి. మీకు కడుపులో నొప్పి ఉంటే చాలా ప్రమాదం.. దానిని ఎక్కువ కాలం విస్మరిస్తే.. భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధిగా మారుతుంది.

ఈ రకమైన సమస్య ఉన్నప్పుడు, తప్పనిసరిగా పిత్తాశయం అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఆపరేషన్ ద్వారా పిత్తాశయం నుండి రాయిని తొలగించవచ్చు. ఇది ఒక యొక్క జీర్ణక్రియపై గణనీయమైన ప్రభావాన్ని చూపదు. పిత్తాశయ శస్త్రచికిత్స తర్వాత, రోగులు వారి ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ప్రస్తుతం లాపరోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత, రోగి ఒక రోజు ఆసుపత్రిలో ఉండవలసి ఉంటుంది. అనంతరం రోగి వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. పిత్తాశయం ద్వారా పిత్త వాహికకు రాయి తగిలితే, అప్పుడు ఎండోస్కోపీని ఆశ్రయించాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..