సైలెంట్ గా మీ బరువు పెంచే ఫుడ్స్ ఇవే..! వెంటనే జాగ్రత్తపడండి.. లేకుంటే కష్టమే

మన రోజువారీ ఆహారపు అలవాట్లే శరీర బరువును పెంచే ప్రధాన కారణం కావొచ్చు. కొన్నిచోట్ల నెమ్మదిగా, మనకు తెలిసీ తెలియకపోయినా కొన్ని ఆహారాలు శరీరంలో కొవ్వును పోగు చేస్తూ.. కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంటాయి. ఇవి అధిక శాతం కార్బోహైడ్రేట్లు, చక్కెర, ప్రాసెసింగ్ ద్వారా తయారైన పదార్థాలు కలిగి ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడమే కాకుండా అధిక కేలరీలు అందజేస్తాయి. ఇప్పుడు అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

సైలెంట్ గా మీ బరువు పెంచే ఫుడ్స్ ఇవే..! వెంటనే జాగ్రత్తపడండి.. లేకుంటే కష్టమే
Weight Gain Foods

Updated on: Apr 17, 2025 | 6:02 PM

వైట్ బ్రెడ్ అనేది చాలా మందికి అల్పాహారం రూపంలో ఇష్టమైన ఆహారం. అయితే ఇది పూర్తిగా మైదాతో తయారవుతుంది. ఇందులో ఉన్న రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. దీని వల్ల ఆకలి త్వరగా వేయటం, మళ్లీ తినే తత్వం పెరగడం జరుగుతుంది. ఇలా పదే పదే తినడం వల్ల శరీర బరువు మెల్లిగా పెరుగుతుంది. పాలు లేదా జామ్‌తో కలిపి తినడం వల్ల ఇంకా ఎక్కువ చక్కెర శరీరంలోకి చేరుతుంది.

ఇక పాస్తా విషయానికి వస్తే ఇది కూడా మైదా, ఆలివ్ ఆయిల్, చీజ్ వంటి పదార్థాలతో తయారవుతుంది. ఇవన్నీ అధిక కార్బోహైడ్రేట్లు, కొవ్వుతో కూడి ఉంటాయి. పాస్తా ఎక్కువగా తినడం వల్ల శరీరానికి అధిక శాతం కేలరీలు చేరుతాయి. దీంతో పాటు ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. దీని ఫలితంగా ఫ్యాట్ పెరిగి బరువు పెరగడానికి దోహదపడుతుంది.

బేకరీ ఫుడ్స్ అంటే కేకులు, పేస్ట్రీలు, పఫ్‌లు, బన్లు మొదలైనవి. ఇవి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి, తినడానికి రుచిగా కూడా ఉంటాయి. కానీ వీటిలో చక్కెర, మైదా, ఘీ, బటర్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి తాత్కాలికంగా శక్తిని ఇచ్చినా మలబద్ధకాన్ని పెంచి కొవ్వును నిల్వ చేసే విధంగా పని చేస్తాయి. దీని వల్ల శరీర బరువు పెరగడం జరుగుతుంది.

రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ వంటి మాంసాలు. ఇవి ప్రొటీన్లు ఉన్నా ఇందులో ఉన్న సాచ్యురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఇవి తినడం వల్ల బరువు పెరగటమే కాకుండా హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్రై చేసి తినడం వల్ల దీనిలోని ఫ్యాట్ శాతం మరింత పెరిగి మెటబాలిజాన్ని మందగించేస్తుంది.

స్వీట్ గా ఉండే కూల్‌డ్రింక్స్ కూడా బరువు పెరగడానికి కీలకమైన కారకం. ఇవి తాగడానికి కూలుగా, స్వీట్ గా ఉన్నా ఇందులో అధికంగా హై ఫ్రుక్టోస్ కార్న్ సిరప్ లేదా చక్కెర వాడుతారు. ఇవి శరీరంలో త్వరగా గ్లూకోజ్‌గా మారి ఫ్యాట్‌గా నిల్వవుతాయి. వేసవిలో తరచూ వీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా బరువు పెరగడం జరుగుతుంది.

ప్రాసెస్ చేసిన ఫుడ్.. రెడీ టు ఈట్, ప్యాకెజ్డ్ ఐటమ్స్ కూడా బరువుని పెంచే ప్రమాదం కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రిజర్వేటివ్‌ లు, సోడియం, ఫ్లేవరింగ్ ఏజెంట్స్‌తో తయారవుతాయి. దీని వల్ల మానవ శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడంతో పాటు.. పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుపోతుంది. దీంతో బరువు మెల్లిగా పెరుగుతుంది.

ఈ రకమైన ఆహార పదార్థాలను మితంగా తీసుకోవడం ద్వారా శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే నూనె తక్కువగా ఉండే ఆహారాలు, తాజా పండ్లు, కూరగాయలు, తక్కువ ప్రాసెసింగ్ ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది.