Joint Pains In Winter: శీతాకాలంలో కీళ్ల నొప్పులా? మెడిసిన్స్‌కు బదులు ఈ ఫుడ్స్‌ తీసుకుంటే బెటర్‌

|

Nov 29, 2022 | 10:51 AM

ఉష్ణోగ్రత మార్పులు, చల్లని వాతావరణంతో ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు బాగా ఇబ్బందిపెడతాయి. ఇక పెరుగుతున్న వయస్సుతో, శరీరం, ఎముకలలో రక్త ప్రసరణ వేగం మందగించడం ప్రారంభమవుతుంది.

Joint Pains In Winter: శీతాకాలంలో కీళ్ల నొప్పులా? మెడిసిన్స్‌కు బదులు ఈ ఫుడ్స్‌ తీసుకుంటే బెటర్‌
Winter Joint Pain
Follow us on

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు శీతాకాలంలో సాధారణం. ముఖ్యంగా వృద్ధులకు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు ఈ సీజన్ లో మొదలవుతాయి. శీతాకాలంలో పాత గాయాలు బాగా ఇబ్బంది పెడతాయి. ఉష్ణోగ్రత మార్పులు, చల్లని వాతావరణంతో ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు బాగా ఇబ్బందిపెడతాయి. ఇక పెరుగుతున్న వయస్సుతో, శరీరం, ఎముకలలో రక్త ప్రసరణ వేగం మందగించడం ప్రారంభమవుతుంది. దీని వల్ల మోకాళ్లు, తుంటి నొప్పులు మొదలవుతాయి. కండరాల నొప్పులతో శరీరంలో విపరీతమైన వణుకు మొదలవుతుంది. ఫలితంగా కండరాలలో నొప్పి, వాపు మొదలవుతుంది. శీతాకాలంలో సూర్యరశ్మి లేకపోవడం వల్ల, కండరాలలో నొప్పి మాములుగానే ఉంటుంది. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం మొదలవుతంది. మందులు వాడడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ శీతాకాలం సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

హైడ్రేషన్

శీతాకాలంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది చలిలో శరీరానికి అవసరమైనంత నీరు తాగరు. దీని కారణంగా మీరు కీళ్లలో నొప్పి, కండరాలలో తిమ్మిరి సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం తగిన స్థాయిలో నీళ్లు తాగాలి. అదేవిధంగా కొన్ని పండ్ల రసాలు తీసుకుంటే కీళ్లు, కండరాల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

పోషకాహారం

చలికాలంలో వృద్ధులకు లేదా యువకులకు పాదాలు, చేతుల్లో నొప్పి నిరంతరంగా ఉంటుంది. ఇలాంటి వారు బలమైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్ సి, డి, కె అధికంగా ఉండే ఆహార పదార్థాలను మెనూలో బాగా చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఎముకలకు మేలు చేసేలా..

ఆహారంలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పాలకూర, క్యాబేజీ, టమోటాలు, నారింజలను ఎక్కువగా తినండి. ఇది మీ ఎముకలకు కూడా చాలా మేలు చేస్తుంది.

(నోట్‌: పైన తెలిపిన విషయాలు నిపుణుల అభిప్రాయం, సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..