Health Tips: ఆధునిక కాలంలో చాలామంది కొలస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం అనేకం ఉన్నాయి. సమయపాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది స్థూలకాయం బారిన పడుతున్నారు. దీంతో గుండెజబ్బుల బారిన పడుతున్నారు. వాస్తవానికి మనిషి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి చెడుదైతే రెండవది మంచిది. చెడు కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారి తీస్తోంది. అందుకే కొలస్ట్రాల్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం. మనిషి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్( HDL)ఎంత మంచిదో..బ్యాడ్ కొలెస్ట్రాల్(LDL)అంత ప్రమాదకరం. బ్యాడ్ కొలస్ట్రాల్ వల్ల గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కూరగాయలు అధికంగా తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్..కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. బ్రకోలి, చిలకడదుంప కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
రెండోది నట్స్, తృణ ధాన్యాలు. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ను తగ్గించవచ్చు. నట్స్‌లో ఉండే ప్రోటీన్ రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఓట్స్‌లో అధికంగా ఉండే ఫైబర్ బీటా గ్లూకాన్ రూపంలో ఉంటుంది. ఆకలిని తగ్గించడమే కాకుండా ఇది కొవ్వును కరిగిస్తుంది. ప్రతిరోజు గ్రీన్ టీ తాగాలి. ఇది LDL కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె LDL, HDL నిష్పత్తిని సమతుల్యం చేస్తుంది. వెల్లుల్లిని ప్రతిరోజు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవిసె గింజలు, చేప నూనె చెడు కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, ధూమపానం, మద్యానికి దూరంగా ఉంటే మంచిది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.