Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి 5 శాఖాహార ఆహారాలు.. ప్రతిరోజు తినాల్సిందే..!

|

Apr 12, 2022 | 11:09 AM

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యం. డైట్‌లో అనేక రకాల ఆహారాలను చేర్చుకోవచ్చు. ఈ వెజిటేరియన్ ఫుడ్స్

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి 5 శాఖాహార ఆహారాలు.. ప్రతిరోజు తినాల్సిందే..!
Vegetarian Foods
Follow us on

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యం. డైట్‌లో అనేక రకాల ఆహారాలను చేర్చుకోవచ్చు. ఈ వెజిటేరియన్ ఫుడ్స్ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో వెల్లుల్లి, బ్రోకలీ ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయం చేస్తాయి. మంచి పోషకాలు ఉండే ఐదు శాఖాహార ఆహారాల గురిరంచి తెలుసుకుందాం. అందులో మొదటిది పన్నీరు. ఇందులో ప్రొటీన్లు, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా చేస్తాయి. విటమిన్ డికి మంచి మూలం.

పప్పు

కాయధాన్యాలు ప్రోటీన్‌కి మంచి మూలం. వీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. విటమిన్ బి, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పప్పు తింటే చాలా సేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. దీని కారణంగా మీరు ఎక్కువ అనారోగ్యకరమైన ఆహారాన్ని తినరు. ప్రొటీన్ లోపాన్ని తొలగించేందుకు ఇవి పనిచేస్తాయి. మంచి ఆరోగ్యం కోసం రోజూ ఒక కప్పు పప్పు తినడం మంచిది.

పచ్చని ఆకుకూరలు

ఆకుపచ్చని ఆకుకూరలు బచ్చలికూర, బ్రోకలీ, పాలకూర, తోటకూరలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. వీటిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్‌తో పోరాడేందుకు ఇవి పనిచేస్తాయి. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. మీరు నిమ్మరసం లేదా వెనిగర్ కలపడం వల్ల వీటిని తినవచ్చు. దీంతో శరీరానికి క్యాల్షియం ఎక్కువగా అందుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో మాంగనీస్, విటమిన్ బి6, విటమిన్ సి, సెలీనియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. అవి అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. మధుమేహం, కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

బీన్స్

బీన్స్‌లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు బీన్స్ మీకు పెద్ద మొత్తంలో పొటాషియం, జింక్, బి విటమిన్లు, కాల్షియంలను అందిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Back Pain: నడుంనొప్పులకి శస్త్రచికిత్స తప్పనిసరి కాదు.. కొన్నిటిని ఇలా తగ్గించుకోవచ్చు..!

Health Tips: అన్నం తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Summer Tips: వేసవిలో చియా సీడ్స్‌, మజ్జిగ వల్ల అనేక ప్రయోజనాలు.. ఈ సమస్యలకి చక్కటి ఉపశమనం..!