Weight Loss: బరువు తగ్గాక ఈ 5 ఆహార నియమాలు తప్పనిసరి.. అప్పుడే బెల్లీఫ్యాట్‌ పెరగదు..!

|

May 23, 2022 | 5:05 PM

Weight Loss: బరువు తగ్గడం మామూలు విషయం కాదు. దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది జిమ్‌లో గంటల తరబడి చెమట చిందించి

Weight Loss: బరువు తగ్గాక ఈ 5 ఆహార నియమాలు తప్పనిసరి.. అప్పుడే బెల్లీఫ్యాట్‌ పెరగదు..!
Weight Loss
Follow us on

Weight Loss: బరువు తగ్గడం మామూలు విషయం కాదు. దీనికోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది జిమ్‌లో గంటల తరబడి చెమట చిందించి కేలరీలని బర్న్‌ చేస్తారు. మరికొందరు ఆహారంలో మార్పులు చేయడం, ధూమపానం , ఆల్కహాల్ మానేయడం వంటి పద్దతుల ద్వారా బరువు తగ్గుతారు. వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా బరువు తగ్గుతారు. అయితే విజయవంతంగా బరువు తగ్గిన తర్వాత మళ్లీ బెల్లీ ఫ్యాట్‌ పెరగకుండా చూసుకోవాలి. అప్పుడు ఎలాంటి డైట్‌ మెయింటెన్‌ చేయాలో తెలుసుకుందాం.

1. తక్కువ కేలరీల ఆహారాలు తినడం

బరువు తగ్గినవారు తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనివల్ల బెల్లీ ఫ్యాట్‌ పెరగకుండా ఉంటుంది. అలాగే వర్కవుట్స్‌ మానేయకూడదు. కంటిన్యూ చేస్తూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

2. కార్బోహైడ్రేట్లను ప్రోటీన్లతో భర్తీ చేయడం

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలని మానేసి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలని తీసుకోవాలి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్‌ పెరగకుండా ఉంటుంది.

3. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తినడం

తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు, రోటీ సబ్జీ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం ముఖ్యం. చిప్స్ లేదా కుకీలను ఎక్కువగా తినకూడదు. దీనివల్ల బెల్లీ ఫ్యాట్‌ పెరగకుండా ఉంటుంది.

4. పండ్లకు నో చెప్పకండి

విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లని తినడం మానవద్దు. పండ్లు పోషకాహారం. ఆపిల్ లేదా కొన్ని బెర్రీలు తీసుకుంటే సురక్షితంగా ఉంటారు. దీనివల్ల శరీరంలో ఫ్యాట్‌ పెరగకుండా ఉంటుంది.

5. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి

సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రి భోజనం సమయంలో టివిలు, సెల్ ఫోన్ లు చూస్తూ తినేప్రయత్నం చెయ్యవద్దు. ఎందుకంటే పరధ్యానంలో మోతాదుకు మించి అధికంగా ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎక్కవ మోతాదు ఆహారం కాస్త శరీరంలో కొవ్వులు చేరటానికి ఆస్కారం కలిగిస్తుంది. ఆహారం తీసుకునే సమయంలో దృష్టి మొత్తం ఆహారంపైను ఉంచటం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయం చేస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి