Lifestyle: విపరీతమైన దాహమా.? వెంటనే అలర్ట్‌ అవ్వాల్సిందే…

అయితే సరిపడ నీటిని తీసుకున్నా కొన్ని సందర్భాల్లో విపరీతమైన దాహం వేస్తుంది. దీర్ఘకాలంగా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అధిక దాహం పలు అనారోగ్య సమస్యలకు లక్షణంగా భావించాలని అంటున్నారు. ఇంతకీ మాటిమాటికీ దాహం వేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలకు లక్షణాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: విపరీతమైన దాహమా.? వెంటనే అలర్ట్‌ అవ్వాల్సిందే...
Health

Updated on: Dec 16, 2023 | 9:09 PM

ఆరోగ్యంగా ఉండడంలో మంచి నీరుది కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. శరీరానికి సరిపడ నీరు లభించకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నీటిని తీసుకోకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది. ఇక శరీరానికి నీరు అందకపోతే వెంటనే దాహం వేయడం సర్వ సాధారణం.

అయితే సరిపడ నీటిని తీసుకున్నా కొన్ని సందర్భాల్లో విపరీతమైన దాహం వేస్తుంది. దీర్ఘకాలంగా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అధిక దాహం పలు అనారోగ్య సమస్యలకు లక్షణంగా భావించాలని అంటున్నారు. ఇంతకీ మాటిమాటికీ దాహం వేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలకు లక్షణాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎంత నీరు తాగుతోన్నా దాహం వేస్తే అది మధుమేహానికి లక్షణం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిని వైద్యులు పాలీడీప్సియాగా పిలుస్తుంటారు. మధుమేహం కారణంగా ఇన్సులిన్‌ పనిచేయదు. మూత్రం నుంచి గ్లూకోజ్‌ రావడం మొదలవుతుంది. మూత్రంలో గ్లూకోజ్‌ వెళ్లడం వల్ల శరీరానికి ఎక్కువ నీరు అవసరపడుతుంది. ఇది పదే పదే దాహం వేయడానికి కారణంగా చెబుతున్నారు. కాబట్టి దాహం ఎక్కువ రోజులుగా ఉంటే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

* కొన్ని సందర్భాల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా దాహం వేస్తుంది. దీర్ఘకాలంగా దాహం ఉంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి దాహానికి డీహైడ్రేషన్‌ కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

* పలు రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడుతుంటారు. అయితే కొన్ని మందులు వాడుతుంటే తరచుగా మూత్ర విసర్జన అవుతుంటుంది. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గి, పదే పదే దాహం వేస్తుంది.

* కొన్ని సందర్భాల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే కూడా అధికంగా దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువకాలం నుంచి దాహం వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.

* శరీరంలో రక్త హీనత ఉన్నా పదే పదే దాహం వేస్తుంది. రక్తంలో ఎర్రరక్త కణాలు సంఖ్య తగ్గినా దాహం వేస్తుంది. కాబట్టి ఐరన్‌ సంబంధిత ఆహారం తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..