Health: ఈ ఐదు టిప్స్ పాటిస్తే బరువు తగ్గడం పెద్ద విషయమేమీ కాదు.. జిమ్ కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు..

బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలల సమయం పట్టవచ్చు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు ఆహారం తీసుకోకపోవడం, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇవేవీ..

Health: ఈ ఐదు టిప్స్ పాటిస్తే బరువు తగ్గడం పెద్ద విషయమేమీ కాదు.. జిమ్ కు వెళ్లాల్సిన అవసరమే ఉండదు..
Weight Loss

Updated on: Nov 02, 2022 | 6:18 PM

బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి నెలల సమయం పట్టవచ్చు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు ఆహారం తీసుకోకపోవడం, కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఇవేవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేవు. దీనికి బదులుగా ఇంట్లోనే వ్యాయామం చేయడాన్ని ఎంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, పుష్కలంగా నీరు తాగడం, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం వంటి పద్ధతులు పాటిస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి చిట్కాలు బరువు తగ్గేందుకే కాకుండా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఈ టిప్స్ పాటిస్తే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే సులభంగా బరువు తగ్గొచ్చు.

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.. మెటబాలిజంను పెంచడానికి ప్రోటీన్ పోషకాలలో రారాజు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. చికెన్, గుడ్లు, చేపలు, పెరుగు, పనీర్ వంటి పదార్థాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్ ను మరవకూడదు.. ఇష్టమైన ఆహారాన్ని ప్లేట్‌ ఫుల్‌గా తినడానికి బదులుగా పరిమాణాన్ని తగ్గించాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒకే సమయంలో తక్కువ ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. పండ్లు, కూరగాయల ముక్కలు, గింజలను అల్పాహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. తాజా పండ్లల్లో శరీరానికి అవసరమైన పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఓట్స్, గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బఠానీల్లో ఫైబర్ అధికం.

ఇవి కూడా చదవండి

జంపింగ్ జాక్స్.. ఈ వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని అన్ని ప్రధాన కండరాలు చురుగ్గా మారతాయి. గ్లూట్స్, హామ్ స్ట్రింగ్స్, క్వాడ్స్, హిప్స్, షిన్‌లను బలపరుస్తుంది. శక్తిని పెంపొందించుకోవడానికి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఈ ఎక్సర్ సైజ్ ఉపయోగపడుతుంది.

ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి.. హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు పుష్కలంగా తాగాలి. భోజనానికి 30 నిమిషాల ముందు నీరు తాగడం వల్ల ఆహారం తీసుకునే క్వాంటిటీని తగ్గించుకోవచ్చు.

కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.. సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ను తాగకపోవడం మంచిది. అంతే కాకుండా ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించాలి. ఇది బరువు పెరగడానికి దోహదపడే కారకాల్లో ఒకటి. పోషక విలువల కోసం స్మూతీస్, హోమ్‌మేడ్ జ్యూస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి