Child Health: పిల్లల్లో ఊబకాయం.. చలికాలంలో మరింత అధికం.. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచి ప్రయోజనాలు..

|

Dec 23, 2022 | 1:53 PM

సాధారణంగా చలి కాలంలో బద్దకం ఆవహించేస్తుంది. బారెడు పొద్దెక్కినా మంచం పై నుంచి లేవాలని అనిపించదు. పిల్లల విషయంలోనూ అంతే. వారిని నిద్ర లేపేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు....

Child Health: పిల్లల్లో ఊబకాయం.. చలికాలంలో మరింత అధికం.. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచి ప్రయోజనాలు..
Child Obesity Causes
Follow us on

సాధారణంగా చలి కాలంలో బద్దకం ఆవహించేస్తుంది. బారెడు పొద్దెక్కినా మంచం పై నుంచి లేవాలని అనిపించదు. పిల్లల విషయంలోనూ అంతే. వారిని నిద్ర లేపేందుకు తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. అయితే చాలా మంది బయటి వాతావరణంలో చలి కారణంగా ఇంట్లోనే ఉండిపోతారు. గంటల తరబడి ఇంట్లోనే గడిపేయడం వల్ల అనారోగ్యానికి గురువుతుంటారు. ముఖ్యంగా వారు బరువు పెరిగిపోతుంటారు. ఈ ఊబకాయం అనేది చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు వంటి వైద్య పరిస్థితులకు దారి తీసే అవకాశం లేకపోలేదు. జన్యుశాస్త్రం, జీవనశైలి, ప్రవర్తన, సమాజ కారకాలు, ఫుడ్ హాబీస్ వంటివి బరువు పెరగడానికి సహాయపడతాయి. అయితే చలికాలంలో బరువు పెరగకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. ఇది మానసిక శ్రేయస్సును నియంత్రిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి పిల్లలను ఎక్కువగా టీవీ లేదా ల్యాప్‌టాప్ చూడటానికి అనుమతించవద్దు. వాటికి బదులుగా వారు వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ వెళ్లేలా చూసుకోవాలి.

ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్, కుకీలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ తాగకుండా చూసుకోవాలి. డైట్ లో గోరువెచ్చని సూప్‌లు, పచ్చి కూరగాయల ముక్కలను తప్పనిసరి చేయాలి. చలికాలంలో పాలకూరతో కూడిన సూప్‌ల వినియోగాన్ని పెంచాలి. జామ వంటి పండ్లు, పీచు ఎక్కువగా ఉండే క్యారెట్ వంటి కూరగాయలను తీసుకోవాలి. పిల్లలు వారి తల్లిదండ్రులను అనుసరిస్తుంటారు కాబట్టి.. వారికి రోల్ మోడల్ గా ఉండాలి. అందుకోసం ముందుగా తల్లిదండ్రుల్లో మార్పులు రావాలి. పిల్లల మానసిక శ్రేయస్సుపై దృష్టి సారించాలి. వారికి ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించాలి. ప్రశాంతవంతమైన నిద్రను అందించాలి. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌ను నివారించడానికి తగినంత వెచ్చదనం అందించాలి.

వాతావరణానికి అనుగుణంగా పిల్లల విహారయాత్రలను ముందుగానే ప్లాన్ చేయాలి. టీకాలు వేయించుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లే ముందు, వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం, శానిటైజర్ రాయడం వంటివి చేయాలి. పెయిన్‌కిల్లర్స్, స్టెరాయిడ్స్, బీటా-బ్లాకర్స్ వంటి కొన్ని మందులు బరువు పెరగడానికి దారితీస్తాయి కాబట్టి శీతాకాలంలో వాటికి దూరంగా ఉండాలి. ఇందు కోసం అత్యవసరమైతే పిల్లల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..