Til ke laddu: సంక్రాంతి పండుగకు నువ్వుల లడ్డూలు చేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

|

Jan 15, 2023 | 6:46 AM

దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి పండుగ పేరు మారినా.. అందరూ ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. పండుగ సీజన్‌లో సాంప్రదాయ పద్ధతిలో పిండి వంటలు, మిఠాయిలు...

Til ke laddu: సంక్రాంతి పండుగకు నువ్వుల లడ్డూలు చేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
Til Laddu
Follow us on

దేశ వ్యాప్తంగా మకర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి పండుగ పేరు మారినా.. అందరూ ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. పండుగ సీజన్‌లో సాంప్రదాయ పద్ధతిలో పిండి వంటలు, మిఠాయిలు చేసుకుంటారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నువ్వుల లడ్డూ గురించి. ఎందుకంటే నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా చలికాలంలో నువ్వుల లడ్డూలు తినడం వల్ల బాడీలో హీట్ పుడుతుందని నిపుణులు చెబుతున్నారు. నువ్వులు, బెల్లంతో తయారుచేసిన లడ్డూలు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వులలో ఐరన్, ప్రొటీన్, విటమిన్ బి, ఈ ఉన్నాయి. ఇవి కళ్లు, కాలేయం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. నలుపు లేదా తెలుపు నువ్వుల గింజలతో లడ్డూలను సిద్ధం చేసుకోవచ్చు. ఇందులో వాడే బెల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలాంటప్పుడు బెల్లంలోని పోషకాలు.. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.తక్కువ కేలరీల ఆహారం కావడంతో బరువు తగ్గేవారు దీనిని తీసుకోవచ్చు.

నువ్వుల లడ్డూలను శీతాకాలంలో తినడం మంచిది. దగ్గు, జలుబు నుంచి సురక్షితంగా ఉంచుతాయి. ఇందులోని క్యాల్షియం ఎముకలు బలంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు శీతాకాలంలో నువ్వుల లడ్డూలను తప్పనిసరిగా తినాలి. ఇందులో ఉండే ఫైబర్ డైజేషన్ సమస్యలను తగ్గిస్తాయి. ఆస్తమా రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో గుండెజబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో నువ్వులు తీసుకోవాలి. ఇందులోని మూలకాలు చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..