వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది శరీరానికి ఎంత ఎనర్జీ ఇస్తుందో మాటల్లో చెప్పలేం. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు నడవాలని నిపుణులు చెబుతుంటారు. ఇతర వ్యాయామాల మాదిరిగానే వాకింగ్.. కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నడక బాడీని ఫిట్ గా ఉంచుతుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. వాకింగ్ చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే..
కేలరీలను బర్న్ చేస్తుంది: కేలరీలను కరిగించి, బరువు తగ్గేందుకు వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా నడవడం కంటే వేగంగా నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా సాఫీగా ఉన్న మార్గంలో నడవడం కంటే.. మెలికలు తిరిగిన దారిలోలో నడిస్తే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి.
టోనింగ్: నడక మీ కాళ్ల కండరాలను బలోపేతం చేస్తుంది. మరింత టోన్‌గా కనిపించేలా చేస్తుంది. జాగింగ్, సైక్లింగ్, స్క్వాట్‌లు, లంగ్స్ వంటి ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: రోజూ 30 నిమిషాల నడక కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఎంత దూరం నడిచామో, ఎంత సమయం నడిచామనే విషయంపై గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది: రెగ్యులర్ వాకింగ్ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, వాకింగ్ చేయడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంటుందని నిరూపించారు. వ్యాయామం, ఆరోగ్యం కోసం భోజనం తర్వాత నడిస్తే మంచి పరిణామాలు ఉంటాయి.
శక్తిని పెంచుతుంది: ఎనర్జీని పెంచడానికి మీరు రెగ్యులర్ గా తీసుకునే కెఫిన్‌కు బదులుగా, ఇంట్లో లేదా ఆఫీసులో కొంత సమయం వాకింగ్ చేయండి. అలసిపోయినప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు మీ శక్తిని పెంచడంలో నడక మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఆక్సిజన్, కార్టిసాల్, ఎపినెఫ్రైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ వంటి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది.
సృజనాత్మకంగా ఉండేలా చేస్తుంది: వాకింగ్ చేయడం ద్వారా మానసిక ఇబ్బందులు తగ్గుతాయి. మైండ్ ని రిలాగ్జేషన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఆలోచనా విధానాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఆఫీసులో ఉన్నా.. ఇంట్లో ఉన్నా నడవడానికి టైమ్ కేటాయిస్తే అద్భుత ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి