మాంసం ఎక్కువగా తినే అలవాటుందా..? వామ్మో.. ఆ ప్రమాదకర వ్యాధి బారిన పడతారట జాగ్రత్త
అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. తక్కువ పరిమాణంలో తినడం లేదా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసానికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు అంటున్నారు.

మాంసాహారాన్ని ఎక్కువ మంది ఇష్టంగా తీసుకుంటారు.. అయితే, అలాంటి వారు అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. తక్కువ పరిమాణంలో తినడం లేదా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసానికి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు అంటున్నారు. 10 లక్షల మంది పాల్గొన్న ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీలో ప్రచురితమైంది. ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20% వరకు ఉంటుందని అధ్యయనం కనుగొంది. అదే సమయంలో, రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో, ఈ ప్రమాదం 9% పెరిగినట్లు వెల్లడించింది.
మాంసం తీసుకోవడం పరిమితం చేయండి..
ఈ అధ్యయనం ప్రధాన రచయిత డాక్టర్ షీనా అయాతుంగయ్ మాట్లాడుతూ.. ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తీసుకోవడం పరిమితం చేయడం ముఖ్యం అని మా అధ్యయనం బలమైన సాక్ష్యాలను అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి. తక్కువ ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని తినే వారితో పోలిస్తే, ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులు పెద్దప్రేగు క్యాన్సర్‌తో మరణించే ప్రమాదం 16% ఎక్కువగా ఉందని పరిశోధనలో కనుగొన్నట్లు తెలిపారు. రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదమే ఎదుర్కొవలసి ఉంటుందని పేర్కొన్నారు.
చికెన్ – చేపల నుండి తక్కువ ప్రమాదం?
చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించదని అధ్యయనం కనుగొంది. రెడ్ మీట్ తీసుకోవడం పరిమితం చేయడం, ప్రాసెస్ చేసిన మాంసాలను నివారించడం వంటి ప్రజారోగ్య సిఫార్సులకు మా పరిశోధనలు మద్దతిస్తున్నాయని డాక్టర్ అయతుంగే చెప్పారు. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం కూడా పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు. ఈ అధ్యయనం మాంసం వినియోగం, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని కనుగొన్న అనేక వాటిలో ఒకటి అని.. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




