కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

చాలా మంది తరచు గా కడుపు ఉబ్బరం సమస్య తో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు, జీవనశైలి. పచ్చి కూరగాయలు, పాలు, వేగంగా తినడం, రాత్రి భారీగా భోజనం చేయడం వంటి తప్పులు జీర్ణక్రియ ను దెబ్బతీస్తాయి.

కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా..? దీనికి కారణాలేంటో తెలుసా..?
Bloating Solution

Updated on: Aug 25, 2025 | 6:13 PM

చాలా మంది తరచుగా కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటారు. మన రోజూవారి అలవాట్లే దీనికి ప్రధాన కారణం. మనం తినే పద్ధతి, ఆహార పదార్థాల ఎంపిక, సమయం వంటి చిన్న చిన్న పొరపాట్లు జీర్ణక్రియను దెబ్బ తీసి ఉబ్బరానికి దారి తీస్తాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి కూరగాయలు తినడం

పచ్చి కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వాటిని కొందరికి జీర్ణం చేసుకోవడం కష్టం. దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి ఉబ్బరం వస్తుంది. దీనికి పరిష్కారం.. కూరగాయలను కొద్దిగా ఉడకబెట్టడం లేదా వేయించడం వల్ల జీర్ణం సులభం అవుతుంది.

టీ, కాఫీలో పాలు కలపడం 

చాలా మందికి పాలల్లో ఉండే లాక్టోస్ పడదు. కానీ వారికి ఈ విషయం తెలియదు. పాలతో చేసిన టీ లేదా కాఫీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దీనికి పరిష్కారం.. లాక్టోస్ లేని పాలు, పెరుగు లేదా బాదం, ఓట్స్ పాలు వాడటం మంచిది.

వేగంగా తినడం

తొందరగా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా ఎక్కువగా లోపలికి వెళ్తుంది. ఇది కడుపులో గ్యాస్ పేరుకుపోవడానికి ముఖ్య కారణం. దీనికి పరిష్కారం.. నెమ్మదిగా ప్రతి ముద్దను బాగా నమిలి తినాలి.

రాత్రి భారీగా తినడం

రాత్రిపూట మన జీర్ణక్రియ నెమ్మదిగా పనిచేస్తుంది. అప్పుడు ఎక్కువగా తింటే జీర్ణం సరిగా కాదు.. దీని వల్ల ఉబ్బరం వస్తుంది. దీనికి పరిష్కారం.. రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పడుకునే 2 నుంచి 3 గంటల ముందే భోజనం పూర్తి చేయాలి.

భోజనంతో పండ్లు తినడం

పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ అన్నం లేదా రొట్టెలతో కలిపి తింటే అవి కడుపులో పులిసిపోయి గ్యాస్ తయారై ఉబ్బరం వస్తుంది. దీనికి పరిష్కారం.. పండ్లు భోజనానికి ఒక గంట ముందు లేదా తర్వాత తీసుకోవడం మంచిది.

షుగర్ ఫ్రీ ఆహారాలు 

డైట్ ఫుడ్స్‌లో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు (artificial sweeteners) కడుపులో పులిసిపోయి ఉబ్బరానికి కారణమవుతాయి. దీనికి పరిష్కారం.. ప్రోటీన్ బార్లు, తక్కువ కేలరీల ఐస్‌క్రీమ్‌లు వంటి వాటి లేబుల్స్ చదివి కృత్రిమ పదార్థాలు ఉన్నవాటిని తగ్గించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)