Health Tips: ఎండాకాలం ఇదొక్కటి తింటే చాలు.. దాదాపు అన్ని సమస్యలకి పరిష్కారం..!

|

Mar 26, 2022 | 5:53 AM

Health Tips: వేసవిలో అధిక వేడి వల్ల చాలామంది ఇబ్బందిపడుతారు. ఉక్కపోత, అధిక చెమట వల్ల డీ హైడ్రేషన్‌కి గురికావల్సి వస్తోంది. ఇలాంటి వారు నీరు శాతం ఎక్కువగా ఉన్న

Health Tips: ఎండాకాలం ఇదొక్కటి తింటే చాలు.. దాదాపు అన్ని సమస్యలకి పరిష్కారం..!
Eating Curd
Follow us on

Health Tips: వేసవిలో అధిక వేడి వల్ల చాలామంది ఇబ్బందిపడుతారు. ఉక్కపోత, అధిక చెమట వల్ల డీ హైడ్రేషన్‌కి గురికావల్సి వస్తోంది. ఇలాంటి వారు నీరు శాతం ఎక్కువగా ఉన్న ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది పెరుగు. కొంతమందికి పెరుగు అంటే ఇష్టముండదు. ఎందుకంటే దీనివల్ల బరువు పెరుగుతామనే అపోహలో ఉంటారు. కానీ ఎండాకాలం పెరుగు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. పెరుగుతో తయారుచేసే మజ్జిగ డీ హైడ్రేషన్ సమస్యకి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తినాలి. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచే శరీరం పోషకాలని గ్రహిస్తుంది. పెరుగులో పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని వివిధ అధ్యయనాలలో తేలింది.

ఇతర పాల పదార్థాల్లానే పెరుగులోనూ క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్‌ అధికంగా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. రోజూ పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్‌ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు కప్పు పెరుగు తింటే చాలా ఉపశమనం దొరుకుతుంది. అది ఒత్తిడిని సులువుగా తగ్గించేస్తుంది. మానసిక సాంత్వనను అందిస్తుంది. అధిక బరువుని నియంత్రిస్తుంది.

ప్రతిరోజూ పెరుగు తీసుకునే వారిలో గుండె సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అంతేకాదు బీపీ కూడా అదుపులోకి ఉంటుంది. అయితే పెరుగు పుల్లగా ఉండకుండా చూసుకోవాలి. పెరుగును మట్టిపాత్రలో లేదా సిరామిక్‌ గిన్నెలో తోడు పెడితే గడ్డ పెరుగు తయారవుతుంది. అంతేకాదు రుచిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా పెరుగుని ఎప్పుడూ వేడి చేయకూడదని గర్తుంచుకోండి. దీనివల్ల అందులో ఉండే పోషకాలన్ని నాశనమవుతాయి. పెరుగుని ఎలాంటి పండ్లతో కలిపి తీసుకోకూడదు.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత

Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

IPL 2022: ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లు వీరే..!