
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. గుమ్మడికాయ గింజల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, మంచి కొవ్వులు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఉదయం తీసుకుంటే శక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. రోజంతా చురుకుగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎముకల బలానికి ఇవి మంచిగా ఉపయోగపడతాయి.
ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులో మెగ్నీషియం, జింక్, ఒమేగా 3 వంటి మంచి పోషకాలు ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ఈ గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ తగ్గితే అలసట, బలహీనత వంటివి వస్తాయి. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల ఈ ఐరన్ లోపం తగ్గుతుంది. రక్తహీనత నుండి రక్షణ లభిస్తుంది.
ఈ గింజల్లో శరీర మంట నివారణ లక్షణాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, థైరాయిడ్ వంటివి మంటకు కారణమవుతాయి. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల ఈ మంట కొంతమేర తగ్గుతుంది.
ఈ గింజల్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ అనే హానికర మూలకాల నుండి శరీరాన్ని కాపాడతాయి. చర్మం, శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఇది అవసరం.
గుమ్మడికాయ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల ఫైబర్ ను శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు అందేలా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ గింజలను తినడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)