చర్మానికి హాని లేకుండా వాక్సింగ్..ఇంట్లో సింపుల్ గా చేయడం ఎలా?

|

Jan 12, 2025 | 2:47 PM

వాక్సింగ్ ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. షుగర్ వాక్సింగ్ ద్వారా చర్మాన్ని ఎక్సోఫోలియేట్ చేస్తూ మెరుగు ఇస్తుంది. హనీ వాక్సింగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో స్కిన్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది. కోకో వాక్సింగ్ స్కిన్ కి పోషణ అందిస్తుంది. అలోవెరా వాక్సింగ్ చర్మాన్ని బిగుతుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ పద్ధతులు చర్మానికి హాని చేయకుండా సహజంగా జుట్టును తొలగించడంలో సహాయపడతాయి. పార్లర్ ఖర్చు లేకుండా, ఇంట్లోనే వాక్సింగ్ తయారుచేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. సహజ పదార్థాలతో తయారవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మానికి హాని లేకుండా వాక్సింగ్..ఇంట్లో సింపుల్ గా చేయడం ఎలా?
Home Made Waxing
Follow us on

వాక్సింగ్ అంటే మనలో చాలా మంది మహిళలకు ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే ఇది మీ అందాన్ని సైతం రెట్టింపు చేస్తుంది. వాక్సింగ్ చేయించుకునేవారు కచ్చితంగా దానిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అలా అని పార్లర్ కి పోవాలంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇంట్లోనే సహజంగా ఈ హెయిర్ వాక్సింగ్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ వాక్సింగ్

ఇంట్లో షుగర్ తో తయారుచేసే ఈ వాక్స్ చికిత్స చర్మానికి చాలా మేలుచేస్తుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఒక చిన్న గిన్నెలో షుగర్, నిమ్మరసం, ఉప్పు, నీటిని వేసి మరిగించండి. మిశ్రమం పంచదార పాకంలా గట్టి పదార్ధంగా మారిన తర్వాత దాన్ని స్టౌవ్ నుంచి తీసి చల్లారనివ్వండి. దీనిని చర్మంపై అప్లై చేసి జుట్టును సులభంగా తొలగించవచ్చు. ఇది చర్మాన్ని ఎక్సోఫోలియేట్ చేస్తూ, చర్మానికి మెరుగు నిస్తుంది.

హనీ వాక్సింగ్

హనీని ఉపయోగించి తయారుచేసే ఈ వాక్స్ చికిత్స యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో నిండుగా ఉంటుంది. హనీ, నిమ్మరసం, షుగర్ ను మైక్రోవేవ్‌లో రెండు దఫాలుగా 30 సెకన్లపాటు వేడి చేయండి. మిశ్రమం సజావుగా కలిసిన తర్వాత చల్లారనివ్వండి. తర్వాత చర్మంపై జుట్టు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి తొలగించవచ్చు. ఇది జుట్టును మృదువుగా తొలగించడం మాత్రమే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.

కోకో వాక్సింగ్

కోకోతో తయారుచేసిన ఈ వాక్స్ మిశ్రమం చర్మానికి సరైన పోషణ అందించడంలో సహాయపడుతుంది. కోకో పౌడర్, షుగర్, గ్లిజరిన్, నిమ్మరసం, ఉప్పును కలిపి స్టౌవ్ మీద మరిగించండి. మిశ్రమం స్థిరత్వానికి వస్తే దాన్ని చల్లారనివ్వండి. తర్వాత దీనిని చర్మంపై అప్లై చేసి జుట్టును తొలగించండి. ఇలా చేస్తే మీ చర్మానికి ప్రకాశవంతమైన రూపాన్ని అందిస్తుంది.

అలోవెరా వాక్సింగ్

అలోవెరాలోని సహజ గుణాలను ఉపయోగించి జెలటిన్ మిశ్రమం ద్వారా ఈ వాక్స్ పద్ధతిని తయారుచేయవచ్చు. జెలటిన్, పచ్చి పాలు, అలోవెరా జెల్‌ను కలిపి మైక్రోవేవ్‌లో వేడి చేయండి. మిశ్రమం మృదువుగా మారిన తర్వాత చర్మంపై అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వండి. ఆ తర్వాత మెల్లగా తొలగించండి. ఈ పద్ధతి చర్మాన్ని దృఢంగా, మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

ఇలా ఇంట్లోనే వ్యాక్సింగ్ ను తయారు చేసుకోవడం వల్ల డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇవి సహజమైన పదార్థాలతో తయారవడం వల్ల చర్మానికి హాని కలగదు. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో ఈ విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.