
అసాధారణ తలనొప్పి: మీకు నిరంతరం తలనొప్పి ఉన్నప్పుడు అది సడెన్‌గా వచ్చి సాధారణ తలనొప్పిలా అనిపించకపోతే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే అది స్ట్రోక్ యొక్క ప్రారంభ లక్షణం కావచ్చు.ఈ రకమైన తలనొప్పి ఏ మందులతోనూ తగ్గదు. దీనితో పాటుగా తల తిరగడం, వాంతులు లేదా దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.

ముఖం, చేతులు - కాళ్ళలో తిమ్మిరి: స్ట్రోక్ వచ్చే ముందు, ముఖం, చేయి లేదా కాలు వంటి శరీరంలోని ఒక భాగం అకస్మాత్తుగా తిమ్మిరిగా మారి బలహీనంగా అనిపిస్తుంది. ఈ బలహీనత క్రమంగా పెరిగి కొన్ని నిమిషాల్లోనే అదృశ్యమయ్యే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక తిమ్మిరిని అస్సలు విస్మరించకూడదు.

ఆకస్మిక దృష్టి సమస్యలు: మీ దృష్టిలో అకస్మాత్తుగా మార్పులు కనిపించడం కూడా స్ట్రోక్ యొక్క ముఖ్యమైన సూచన. అస్పష్టమైన దృష్టి, ఒకటి లేదా రెండు కళ్లలో అకస్మాత్తుగా దృష్టి తగ్గిపోవడం, అకస్మాత్తుగా కాంతి వెలుగులు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

సమతుల్యత కోల్పోవడం - తలతిరగడం: మెదడులోని సమతుల్యత, సమన్వయ భాగానికి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల వేగంగా తలతిరగడం, అస్థిరంగా ఉండటం, నడవడానికి ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు క్రమంగా తీవ్రమవడం లేదా మళ్లీ మళ్లీ రావడం స్ట్రోక్ యొక్క ప్రధాన సంకేతం.

ఈ ప్రారంభ సంకేతాలు కనిపించినప్పుడు, వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ద్వారా ప్రాణాంతకమైన స్ట్రోక్ లేదా పక్షవాతం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముందే జాగ్రత్త పడితే పెద్ద ప్రమాదాన్ని నివారించవచ్చు.