
అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతకాలంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ఒకప్పుడు వృద్ధులకు గుండెపోటు వచ్చేది.. కానీ నేటి కాలంలో యువకులు, చిన్నారులు సైతం గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు రావడానికి కొన్ని నెలల ముందు నుంచే మన శరీరంలో లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వాటిని సకాలంలో గుర్తించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు. గుండెపోటు రావడానికి 30 రోజుల ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం..
గుండెపోటు రాకముందు, రోగికి ఛాతీ నొప్పి అనిపించవచ్చు. ఈ స్థితిలో రోగి ఛాతీ చుట్టూ ఒత్తిడి, భారాన్ని అనుభవించవచ్చు. కొన్నిసార్లు చేతులు, భుజాలు దవడలో కూడా నొప్పి ఉండవచ్చు. మీకు ఛాతీ, భుజం, దవడలో కూడా నొప్పి ఉంటే, మీరు ఈ సంకేతాన్ని అస్సలు విస్మరించకూడదు.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
గుండెపోటుకు ముందు, శరీరం అలసట – బలహీనత అనుభూతి చెందుతుంది. మీరు ఏ పని చేయకుండానే ఎప్పుడూ అలసిపోయి, బలహీనంగా అనిపిస్తే, దానిని విస్మరించకూడదు. బదులుగా మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గుండెపోటుకు 30 రోజుల ముందు రోగికి పదే పదే తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు, మూర్ఛపోతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఈ సమయంలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, రక్త ప్రవాహం తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి.
గుండెపోటు రాకముందు, ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటాడు. మీరు చాలా అలసిపోతే లేదా తేలికైన పని చేసిన తర్వాత ఊపిరి ఆడకపోవడం ప్రారంభిస్తే, అది గుండెపోటుకు సంకేతం కావచ్చు. మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందండి.. వారు సూచించిన విధంగా మందులు వాడండి.. డైట్ ను ఫాలో అవ్వండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..