Duplicate Numbers: ప్లాస్మా దానం పేరుతో నకిలీ నెంబర్లు.. సోషల్‌ మీడియాలో వందలాది ఫోన్‌ నెంబర్ల లిస్టు

|

May 05, 2021 | 7:42 AM

Duplicate Numbers: ఆపద సమయంలో ఆదుకునే వారి కోసం బాధితులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతో సహాయం

Duplicate Numbers: ప్లాస్మా దానం పేరుతో నకిలీ నెంబర్లు.. సోషల్‌ మీడియాలో వందలాది ఫోన్‌ నెంబర్ల లిస్టు
Plasma Donation
Follow us on

Duplicate Numbers: ఆపద సమయంలో ఆదుకునే వారి కోసం బాధితులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతో సహాయం చేసేవారి కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఓ వైపు వైద్యులు బ్లడ్‌, ప్లాస్మా, ఇంజక్షన్‌ కావాలని చెబుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా, రెమిడెసివర్‌కు డిమాండ్‌ బాగా ఉంది. ఈ కరోనా సమయంలో చాలా మంది వాటి కోసం సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. చాలా మంది రక్తం, ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధమంటూ ఫోన్‌ నంబర్లతో కూడిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అయితే వందలాది నెంబర్లు ఆ జాబితాలో ఉన్నాయి. బాధితులు ఆ సమాచారాన్ని చూసి నంబర్లకు ప్రయత్నిస్తే ఆ నంబర్లు పని చేయకపోవడంతో ఆందోళన కలిగిస్తోంది.

వందల నంబర్లలో ఒక్క నంబర్‌ పని చేయదా అనే ఆశతో అన్ని నంబర్లకు కాల్‌ చేస్తున్నారు. కానీ అందులో ఏ ఒక్క నంబర్‌ కలవడం లేదు. ఒక వేళ ఫోన్‌ చేస్తే రింగ్‌ అయినా.. లిఫ్ట్‌ చేయడం లేదు. పదే పదే ఫోన్‌ చేసి బాధితులు ఆశలు వదులుకుంటున్నారు. అనవసరంగా వారి విలువైన సమయం వృథా చేసుకుంటున్నారు. నెటిజన్లు ఫేక్‌ నంబర్లను గుడ్డిగా వైరల్‌ చేయకుండా సరైనవా? కావా? అని పరిశీలించాకే షేర్‌ చేయాలని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని.. నిజంగా సేవ చేసే వారి వివరాలను మాత్రమే షేర్‌ చేయాలని చెబుతున్నారు.

ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ల రాక..! 45 ఏళ్లకు పైబడి వారికి పంపిణీ.. మిగిలితే ఉద్యోగులకు..?

మెంతి, ఉసిరితో కరోనా బహుపరార్..? ఒక్కసారి ట్రై చేయండి..! రిజల్ట్ మీకే తెలుస్తుంది..