Water: తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొచ్చా.. అసలు మంచి నీళ్లు ఎలా, ఎప్పుడు తాగాలో తెలుసా..

|

Feb 16, 2022 | 7:15 AM

మనం అనారోగ్యానికి గురైతే శరీరం నష్టపోవడంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.

Water: తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొచ్చా.. అసలు మంచి నీళ్లు ఎలా, ఎప్పుడు తాగాలో తెలుసా..
Water
Follow us on

మనం అనారోగ్యానికి గురైతే శరీరం నష్టపోవడంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆధునిక జీవన విధానంలో విలువైన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు చాలా మంది. అయితే 120 రోగాలకు దూరంగా ఉండాలంటే ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు.

చాలా మంది నీళ్లు చాలా తొందరగా తాగుతారు. అందులోనూ ఎండాకాలం అంటే ఇంకా ఫాస్ట్‌గా తాగుతారు. కానీ నీళ్లు టీ, కాఫీ ఎలా తాగుతామో అలా తాగితే మంచిది. నీళ్లను సిప్ చేస్తూ తాగడం వలన ప్రతి గుటక నీటితో, మన నోటిలో ఉండే లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకిపోతుంది. దీంతో ఎలాంటి హాని కలగదు.అంతేకాకుండా నీళ్లను గటగటా తాగడం వల్ల శరీరంలోని హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి ఉంటుంది. దాంతో అధిక ఎసిడిటి ఏర్పడుతుంది.

బాగా చల్లగా ఉండే నీటిని ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. శరీరంలో ఎప్పుడు ఎదో ఒక క్రియ జరుగుతూనే ఉండటం వలన మన శరీరంచాలా వేడిగా ఉంటుంది. దానికి తోడు చల్లటి నీళ్లు తాగితే రెండు భిన్న వ్యతిరేకమైన టెంపరేచర్ మన శరీరం మీద పడి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎండాకాలం చల్లటి నీళ్లు కావాలంటే కుండలో నీళ్లు తాగితే మంచిది.

భోజనం తినడానికి ముందు, తరవాత కూడా అరగంట నీళ్లు తాగకండి. ఎందుకంటే తిన్న ఆహారం పొట్టలోని ఈసోపేగాస్‌లోకి వెళ్తుంది. అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిములను చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది. తక్కువ పీహెచ్ విలువ కలిగిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఎంజైమ్‌లకు ఉపయోగపడి మనం తిన్న ఆహారం త్వరితంగా జీర్ణమైశక్తిని విడుదలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నా సమయంలో మనంతిన్న వెంటనే నీళ్లు తాగితే, మన జీర్ణ వ్యవస్థ నెమ్మెదిస్తుంది. దానితో జీర్ణం తర్వాత వ్యర్థలు శరీరంలో అలాగే మిగిలిపోతాయి. దానితో అనేక రోగాలు వస్తాయి.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also.. Health Tips: తినే ఆహారంలో ఈ పండుని చేర్చుకోండి.. ఆరోగ్యకరమైన నిగనిగలాడే చర్మం, ఒత్తైన, పొడవైన జుట్టును సొంతం చేసుకోండి..