Drinking Coffee Tips : పని ఒత్తిడి.. అలసట తీరేందుకు చాలామంది కాఫీ, టీ లాంటివి తాగుతుంటారు. అయితే.. చాలామందికి కాఫీ అంటే తెగ ఇష్టం. ఇది వారి ఆహారంలో అలవాటుగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. కాఫీ తాగే వ్యక్తులు దానిని తాగే ముందు ఎలాంటివి తినకూడదు, తీసుకోకూడదో అనే విషయాలను విస్మరిస్తుంటారు. అయితే.. ఆ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే సమస్యలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. కాఫీ తాగడానికి ఒక గంట ముందు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు.. నిపుణుల అభిప్రాయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను అస్సలు తినవద్దు
కాఫీ తాగే ముందు.. కాల్షియం అధికంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి. వాస్తవానికి కాల్షియం కాఫీలో ఉన్న కెఫిన్ ద్వారా శరీరంలో గ్రహించదు. అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ శరీరం దాని ప్రయోజనాన్ని పొందలేదు.
ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండండి
కాఫీకి ముందు నూనె ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. ఒకవేళ తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య రావచ్చు. కాబట్టి ఎప్పుడూ అలాంటి తప్పు చేయవద్దు.
జింక్ అధికంగా ఉండే వాటిని తీసుకోవద్దు..
జింక్ ఉన్న వాటిని కూడా కాఫీకి ముందు తినకూడదు. ఎందుకంటే మీరు కాఫీని తాగిన వెంటనే.. మీ శరీరం జింక్ ఉన్న ఆహార పదార్థాలను బయటకు పంపుతుంది. ఇది మీ శరీరానికే హాని కలిగిస్తుంది.
ఐరన్ రిచ్ ఫుడ్స్ తినవద్దు
కాఫీ తాగే ముందు ఐరన్-రిచ్ ఫుడ్స్ తీసుకోకండి. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. అంటే బఠానీలు, పండ్లు, పప్పులు, శనగలు లేదా చిక్‌పీస్‌లను తినకూడదు. దీనితో పాటు, విటమిన్-డి వంటి వాటిని దూరం ఉంచండి. మీరు ఈ విటమిన్ ఆహారాన్ని తీసుకున్నా మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: