Fenugreek Water: ప్రస్తుత కాలంలో చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం సమస్య సర్వసాధారణంగా మారింది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు దాని నుంచి ఉపశమనం కోసం ఏవేవో మందులు వాడుతూ.. డైట్లను అనుసరిస్తుంటారు. అయితే డయాబెటిస్‌లో షుగర్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. మీరు కూడా ఈ షుగర్ సమస్యతో బాధపడుతుంటే.. అదుపులో ఉంచుకునేందుకు మెంతులు, మెంతి కూర తీసుకోవచ్చు. మెంతి గింజలు అందరి వంటగదిలో ఉంటాయి. మెంతులు చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా, అనేక ఇతర సమస్యలను కూడా దూరం చేస్తాయి. మెంతుల ప్రయోజనాల, అలాగే చక్కెరను నియంత్రించడానికి మెంతులు ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..
డయాబెటిస్‌లో చక్కెర నియంత్రణకు మెంతి నీరు తాగండి
డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ఇవి పెరిగిన చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి. వాస్తవానికి, గెలాక్టోమన్నన్ అనే మూలకం మెంతి గింజలలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
మెంతులు ఎలా తీసుకోవాలి..?
ఇందుకోసం రాత్రి పడుకునేటప్పుడు రెండు చెంచాల మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. తర్వాత ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఇది ఉత్తమమైనది. ఇది కాకుండా మీరు మెంతులు గింజలను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా తీసుకోవచ్చు. మెంతుల కషాయం అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
మెంతులు తీసుకోవడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..
మెంతులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తవానికి, ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఊబకాయాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అంతే కాకుండా మెంతులు తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది. తల్లి పాల ఉత్పత్తి పెరుగుతుంది, గ్యాస్-మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ని మెంతులు తగ్గిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..