
ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రధాన కారణం పాలు, కాఫీ, టీ, గుడ్లు, మాంసం వంటివి మానేయడమేనని ఖదర్ వాలి పేర్కొనాలి. దేహంలో దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాడని, కానీ మనం అనారోగ్యాన్ని కోరుకొని ఇవన్నీ తింటున్నామని ఆయన వాపోయారు. బియ్యం, చక్కెర, కాఫీ, సిగరెట్లు వంటి అలవాట్లకు మానవ కులం 20 ఏళ్లలోనే బానిసలైపోయిందని, పూర్వం ఈ ఆహార పదార్థాలు లేవని ఆయన అన్నారు. వంద సంవత్సరాల క్రితం కాఫీలు, టీలు, చక్కెరలు లేవని, బియ్యం కూడా ధనవంతులు మాత్రమే తినే వస్తువు అని, పేదవాళ్లు కొర్రలు, రాగులు వంటి చిరుధాన్యాలు తినేవారని చారిత్రక వాస్తవాలను తెలియజేశారు.
డాక్టర్ ఖాదర్ వలి అందించిన ఆరోగ్య సూత్రాల ప్రకారం, తిప్పతీగ కషాయం అనేక దీర్ఘకాలిక, సాంక్రమిక రోగాలకు ఒక సమర్థవంతమైన నివారణిగా ప్రశంసించబడింది. డయాబెటిస్, క్యాన్సర్, గుండె సమస్యలు వంటి ప్రధాన వ్యాధులతో పాటు.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, జికా వంటి సాంక్రమిక రోగాలకు కూడా తిప్పతీగ కషాయం, గరిక కషాయం, బిల్వ కషాయం వంటివి వారం వారం తాగడం ద్వారా దూరంగా ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. తిప్పతీగ మొక్క గుండె ఆకారపు ఆకులతో ఎక్కడబడితే అక్కడ పెరుగుతుందని, దీనిని “అమృతబల్లి” అని కూడా పిలుస్తారని, దాని ఔషధ గుణాలను చాలా మంది గుర్తించలేకపోతున్నారని ఖాదర్ వలి పేర్కొన్నారు. ఇది శరీరంలో ప్రతిరోధక కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. సప్త పత్ర కషాయాల్లో ఒకటైన తిప్పతీగ, వైరస్లు, ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ మొక్కకున్న ప్రత్యేకత ఏమిటంటే, అది ఎండిపోయినా కూడా వేర్లను భూమిలోకి పంపి, తిరిగి కొత్త ఆకులతో చిగురిస్తుంది. దీని కషాయం తయారుచేయడానికి, తిప్పతీగ ముక్క లేదా నాలుగు ఆకులను బాగా మరుగుతున్న నీటిలో ఐదు ఆరు నిమిషాలు ఉంచి, వడపోసుకుని తాగాలి. ఈ కషాయం వారానికి ఒకసారి తీసుకోవడం మంచిది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఔషధ గుణాలున్న ఈ తీగ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తోడ్పడుతుంది.
అలానే.. తీపిని పూర్తిగా తినడం మానేయమని చెప్పట్లేదని, తాటి బెల్లంతో పొబ్బట్లు, పాయసం, అరిసెలు వంటివి చేసుకోవచ్చని ఖాదర్ వలి అన్నారు. ఈ సాంప్రదాయ వంటకాలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పారు. ఆయన సొంతంగా వీటిని రోజూ తింటానని, శక్తివంతంగా ఉంటానని ఉదాహరించారు. కషాయాలలో కొద్దిగా తాటి బెల్లం వేసుకోవడం వల్ల వాటి రుచి మెరుగుపడుతుందని, అన్ని రకాల కషాయాలను సులభంగా సేవించవచ్చని తెలిపారు.
(Note: ఈ సమాచారం ఆయుర్వేద నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఎలాంటి అనుమానం ఉన్నా.. ఈ టిప్స్ ఫాలో అవ్వాలన్నా.. వైద్యులను సంప్రదించండి)