
టమాటాలు మన వంటగదిలో రోజువారీ ఉపయోగించే ఒక ముఖ్యమైన వస్తువు. కొన్ని వంటకాలకు రుచిని పెంచుతాయి. టమాటాలో అనేక పోషకాలు, విటమిన్లు, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. టమాటాలో ఉండే విటమిన్ సి, లైకోపీన్, ఫైబర్ రక్తహీనత, ఆస్తమా, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఏ పదార్థం అయినా అతిగా తింటే శరీరానికి హాని చేస్తుంది.
అసిడిటీ: టమాటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకుంటే అసిడిటీ సమస్యలు వస్తాయి.
గ్యాస్ సమస్య: మీకు కడుపులో గ్యాస్ సమస్య ఉంటే, టమాటాలను ఎక్కువగా తినకూడదు. ఈ సమస్య తగ్గించుకోవాలంటే తక్కువ పరిమాణంలో టమాటాలు తినాలి.
కిడ్నీలో రాళ్ళు: కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు టమాటాలను తినకూడదు. టమాటా గింజలు పిత్తాశయంలో రాళ్లకు కారణం అవుతాయి. అందుకే టమాటాలు తినేటప్పుడు గింజలు తీసేసి తినడం మంచిది.
గుండెలో మంట: టమాటాలు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ సమస్యలు పెరిగి గుండెలో మంట వస్తుంది.
అంతేకాకుండా, టమాటాలు అధికంగా తీసుకుంటే గొంతు, నోరు మండడం, తలతిరగడం లాంటి సమస్యలు కూడా రావచ్చు. టమాటాలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. అది కొందరిలో హిస్టామిన్ ప్రతిచర్యలకు కారణం అవుతుంది. టమాటాలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది కీళ్లనొప్పులు, వాపులకు దారితీస్తుంది.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఆరోగ్య సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. టమాటాలు తినడం వల్ల మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని భావిస్తే, వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. సొంతంగా వైద్యం చేసుకోవడం తగదు.