Iron Deficiency: కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద పెడుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోషక విలువలు కలిగిన ఆహారంపై దృష్టి సారిస్తున్నారు. అందులో బెల్లం, నువ్వులు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు కలిపి తీసుకుంటే శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్‌గా చెప్పవచ్చు. నువ్వులలో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ , మెగ్నీషియం మంచి మూలంగా చెప్పవచ్చు. నువ్వులు గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మరోవైపు బెల్లంలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియకు బెల్లం మేలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తిన్నప్పుడు రెండు ఆహారాల ద్వారా లభించే ప్రయోజనాలు పొందవచ్చు. ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ముఖ్యంగా మహిళలు ఈ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు.
బెల్లం, నువ్వులు కలిపి లడ్డూలు కూడా తయారుచేయవచ్చు. చలికాలంలో వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజుకొక నువ్వుల లడ్డు తింటే రక్తహీనత, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం వంటివి ఏమీ ఉండవు. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. త్వరగా అలసి పోకుండా ఉంటారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.