మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

సాధారణంగా మనిషి పుట్టుక 9 నెలలపాటు తల్లి గర్భంలో నివాసం తర్వాతనే జరుగుతుంది. ఈ సమయం జీవశాస్త్రం ప్రకారం శరీర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో ఉండగా.. పురాతన గ్రాంథాలు అందుకు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నట్లు వివరించాయి. ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి మానవ గర్భధారణ తొమ్మిది నెలలు కేవలం శారీరక అభివృద్ధి మాత్రమే కాదు.. ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా పరిగణించబడుతుందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?
Birth

Updated on: Dec 31, 2025 | 11:57 AM

సాధారణంగా మానవ జననం తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలల తర్వాత జరుగుతుంది. అయితే, మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేటి జీవశాస్త్రం పిండం అభివృద్ధి గురించి వివరించింది. కానీ, అంతకుముందే మన మత గ్రంథాలు, పురాణ గ్రంథాల్లో మనిషి జన్మకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణంలో శారీరక అభివృద్ధి మాత్రమే కాకుండా అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఆత్మ, పునర్ జన్మకు సంబంధించిన కీలక పరిణామాలుంటాయి. పుట్టుక అనేది ప్రవేశ స్థానం అని గ్రంథాలు చెబుతున్నాయి.

మానవ జన్మ దుర్లభం

భారతీయ గ్రంథాలు, పురాణాల ప్రకారం.. మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. ఎనభైలక్షల జీవ జన్మల తర్వాత ఆత్మ మానవ శరీరాన్ని పొందుతుంది. మానవ జన్మకు ఉన్న గొప్ప లక్షణం మనస్సాక్షి, బుద్ధి ఉంటాయి. దీని ద్వారా మంచి, చెడుల మధ్య తేడాను గుర్తిస్తారు. ఇతర జంతువులు వాటి సహజ ప్రవృత్తులు(భయం, ఆహారం, నిద్ర) ప్రకారం మాత్రమే జీవిస్తాయి. కానీ, మానవులు తమ స్వంత కర్మ ద్వారా భవిష్యత్తును సృష్టించుకోగలరు. పురాణ గ్రంథాల ప్రకారం మానవ జన్మ కేవలం ఆనందం కోసం కాదు.. స్వీయ అభివృద్ధి, భగవంతుని సాక్షాత్కారం కోసం ఒక సువర్ణ అవకాశం.

శారీరక అభివృద్ధే కాదు.. ఆధ్యాత్మిక ప్రయాణం

మానవ జన్మ ప్రధాన లక్ష్యం ధర్మం, అర్థం, కామం, మోక్షాలతో కూడిన పురుషార్థం సాధించడం అని చెప్పారు. ఒక వ్యక్తి దానధర్మాలు, సేవ, భక్తితో కర్మలను నాశనం చేయగల సాధనమే మానవ శరీరం. జనన మరణ చక్రం నుంచి మోక్షం లేదా ముక్తి పొందే అవకాశం మానవ జన్మలో మాత్రమే ఉంది. అందుకే మానవ జీవితంలో ప్రతి క్షణాన్ని శుభప్రదంగా మార్చుకోవడం, ధర్మబద్ధంగా వ్యవహరించడం, ఆధ్యాత్మికత పురోగతి సాధించడం మానవ జన్మ నిజమైన అర్థంగా పరిగణిస్తారు.

మానవ జన్మ ప్రాముఖ్యతను వివరిస్తూ ఓ సాధువు ఇలా పేర్కొ్న్నారు.. మానవ శరీరం ఉత్తం, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి గర్భం కేవలం ఆశ్రయం మాత్రమే కాదు.. ఒక ప్రవేశ ద్వారం కూడా అని గ్రంథాలు పేర్కొన్నాయి. గర్భోపనిషత్తు.. ఆత్మ గర్భంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. కానీ, అది ఇప్పటికే గత జన్మల కర్మతో భాగంగా ఉంటుంది. దీనికి మానవ జ్ఞాపకాలలో ఇంకా భాగం కాలేదు. పురాణాల ప్రకారం.. గర్భం అనేది ఆత్మ ప్రవేశించిన తర్వాత క్రమంగా అదృశ్యమయ్యే ప్రదేశం. ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి మానవ గర్భధారణ తొమ్మిది నెలలు కేవలం శారీరక అభివృద్ధి మాత్రమే కాదు.. ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా పరిగణించబడుతుందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.

గర్భ ఉపనిషత్తు.. గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణాన్ని సవివరంగా తెలియజేసింది. మొదటి నెల నుంచి ఎనిమిదవ నెల వరకు ఆత్మ తన గత కర్మలను గుర్తు చేసుకుంటుంది. దేవుడి కోసం ప్రార్థిస్తుంది. తొమ్మిది నెలలు అంటే మానవ శరీరం పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) నుంచి పూర్తిగా ఏర్పడే కాలం. ఇక, ఆత్మ ఈ లోకంలోకి ప్రవేశించడానికి అవసరమైన శారీరక, మానసిక పరిపక్వతను సాధిస్తుంది.

9 సంపూర్ణతకు సంకేతం

ఇక, ఏడవ-ఎనిమిదవ నెలల్లో ఆత్మ పూర్తి స్పహలోకి వచ్చి గర్భంలోని బాధల నుంచి విముక్తి కల్పించమని భగవంతుడిని ప్రార్థిస్తుంది. తొమ్మిది నెలల పూర్తయిన తర్వాత శరీరం మాయ ప్రభావంలోకి వచ్చి బాహ్య ప్రపంచంలో జీవించడానికి సిద్ధమవుతుంది. కాగా, తొమ్మిది సంఖ్యను పురాతన గ్రంథాలలో ‘సంపూర్ణత’ను సూచిస్తుంది. ప్రకృతి చక్రం ఒక నిర్దిష్ట లయలో నడుస్తున్నట్లే.. ఈ తొమ్మిది నెలల కాలం ఆత్మ పూర్తి అభివృద్ధి చెంది, గత జన్మ సంస్కారాల నుంచి విముక్తి పొందడానికి.. కొత్త కర్మలు చేయడానికి అవసరమైన అవకాశ కాలంగా పరిగణించబడుతుంది. తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే బాహ్య ప్రపంచం నుంచి పొందే శక్తి ఆ శరీరంలో సృష్టించబడుతుంది.

శిశువు 9 నెలలు కడుపులో ఎందుకు?

గర్భంలో 9 నెలలు.. ప్రతి నెలా ఆత్మ తన జ్ఞాపకాలను వదిలించుకుంటుందని గ్రంథాలు చెబుతున్నాయి. అదే సమయంలో శరీరం ఆకలి, భావోద్వేగాలకు ఆకర్షితమవుతుంది. భారతీయ విశ్వోద్భవ శాస్త్రం 9 చక్రాలతో నిండి ఉంది. ఈ తొమ్మిది చక్రాలు విధిని నియంత్రిస్తాయి. శిశువు తొమ్మిది నెలలు గర్భంలో ఉండి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. శుక్రుడు మొదటి నెల గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాడు. రెండో నెలలో కుజుడు, మూడవ నెలలో బృహస్పతి, నాల్గవ నెలలో సూర్యుడు, ఐదవ నెలలో చంద్రుడు, ఆరవ నెలలో శని, ఏడవ నెలలో బుధుడు, ఎనిమిదవ నెలలో చంద్రుడు, తొమ్మిదవ నెలలో శిశువుపై మళ్లీ సూర్యూడి ప్రభావం ఉంటుంది. ఇలా తొమ్మిది నెలలు పూర్తయిన తర్వాతనే శిశువు జన్మిస్తాడు.