Betel Nuts: వక్కపొడి తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

సాధారణంగా చాలా మంది వక్కపొడి(Betel Nuts) తింటుంటారు. పాన్ తయారీలో వక్కపొడి ఉపయోగిస్తారు. ఏలాకులు(Cardamoms), దాల్చిన చెక్క(Cinnamon), పొగాకులను వాడి పాన్ తయారు చేస్తారు...

Betel Nuts: వక్కపొడి తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
Vakkapodi

Updated on: Apr 03, 2022 | 9:56 AM

సాధారణంగా చాలా మంది వక్కపొడి(Betel Nuts) తింటుంటారు. పాన్ తయారీలో వక్కపొడి ఉపయోగిస్తారు. ఏలాకులు(Cardamoms), దాల్చిన చెక్క(Cinnamon), పొగాకులను వాడి పాన్ తయారు చేస్తారు. పాన్‌లో కలిపే ఇలాచిలు, దాల్చిన తప్ప మిగతా పదార్థాలు శరీరానికి హానికారం. ఈ పదార్థాలు క్యాన్సర్‌ను కలిగిస్తాయని “ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్” జరిపిన పరిశోధనలలో తేలింది. క్యాన్సర్ కారకాల్లో వక్కపొడి మొదటి స్థానంలో ఉంటుందని చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం వక్కపొడి క్యాన్సర్‌ను కలుగచేసే గుణాలను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. వక్కపొడి తినటం వల్ల క్యాన్సర్ కలిగే అవకాశం ఉందని, ముఖ్యంగా నోటి, అన్నవాహిక క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉందని చాలా పరిశోధనలలో వెల్లడైంది. వక్కపొడి ఎక్కువగా నమిలే వారిలో సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్ అధికంగా ఉత్పత్తి చెందుతుందని.. దీని అధిక ఉత్పత్తి వల్ల దవడ కదలికలలో లోపాలు ఏర్పడతాయి.

వక్కపొడిని అధికంగా తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు గురయ్యే అవకాశాలు అధికం అని, వీటితో పాటుగా, మెటాబొలిక్ సిండ్రోమ్, స్థూలకాయత్వం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రోజు వక్కపొడిని నమిలే వారి చిగుళ్లు చికాకులకు గురవటమే కాకుండా, దంతక్షయం కూడా అవుతుందట. దంతాలు శాశ్వతంగా ముదురు ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారే అవకాశం ఉంటుంది. వక్కపొడి, శరీరంలో వివిధ రకాల రసాయనిక చర్యలకు గురి చేయటమేకాకుండా, హెర్బల్ ఔషదాలతో తీసుకునే అల్లోపతి మందులతో కూడా చర్య జరుపుతుంది.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Summer Health Care: వామ్మో.. కాకరేపుతున్న ఎండలు.. కూల్‌గా ఉండాలంటే వీటిని తీసుకోండి..