Health Tips: కడుపులో నులి పురుగులు పోవాలా.. అయితే ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి!!

|

Aug 27, 2023 | 4:33 PM

చాలా మంది కడుపులో నులి పురుగుల సమస్యతో ఇబ్బంది పడుతూంటారు. అసలు ఇవి మన కడుపులో ఉన్న సంగతి కూడా మనకు తెలీదు. ఈ సమస్య చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కడుపులో నులి పురుగులు ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరసించిపోతారు. కలుషితమైన ఆహారం తినడం, నీళ్లు తాగడం, భోజనం చేసేటప్పుడు పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల చేత కడుపులోకి నులి పరుగులు ఏర్పడతాయి. ఈ పురుగులు మన కడుపులో, ప్రేగుల్లో నివాసాన్ని ఏర్పరుచుకుని..

Health Tips: కడుపులో నులి పురుగులు పోవాలా.. అయితే ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి!!
Intestinal Worms
Follow us on

చాలా మంది కడుపులో నులి పురుగుల సమస్యతో ఇబ్బంది పడుతూంటారు. అసలు ఇవి మన కడుపులో ఉన్న సంగతి కూడా మనకు తెలీదు. ఈ సమస్య చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. కడుపులో నులి పురుగులు ఉంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా నీరసించిపోతారు. కలుషితమైన ఆహారం తినడం, నీళ్లు తాగడం, భోజనం చేసేటప్పుడు పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాల చేత కడుపులోకి నులి పరుగులు ఏర్పడతాయి. ఈ పురుగులు మన కడుపులో, ప్రేగుల్లో నివాసాన్ని ఏర్పరుచుకుని మనం తిసుకునే ఆహారం నుండి పోషకాలను గ్రహించి.. మనల్ని అనారోగ్య పాలు చేస్తుంది. చిన్నారుల్లో అయితే ఎదుగుదల నిలిచిపోయి వివిధ రోగాల బారిన పడతారు.

సరిగ్గా ఉడికించని మాసం తినడం, మట్టిలో ఆడితే పాదాల ద్వారా పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మల పరీక్ష ద్వారా నులి పురుగులను గుర్తిస్తారు. కాళ్లకు చొప్పులు లేకుండా బాత్రూమ్ లకు వెళ్లడం ద్వారా, గాయ కూరలు, ఆకు కూరలు, పండ్లు వంటివి శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన కూడా ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి.

కొన్ని లక్షణాలు బట్టి నులి పురుగులు ఉన్నాయో.. లేదో మనం గుర్తించవచ్చు. పోషకాహార లోపం, రక్త హీనత, కడుపులో నొప్పి, వాంతులు, వికారం, కడుపు ఉబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కనబడతాయి. కడుపులో నులి పురుగులను వీలైనంత త్వరగా తొలగించుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఈ సమస్య తీవ్రతరమై.. ఆపరేషన్ వరకూ వెళ్లాల్సి వస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడే వారు కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. నులి పురుగులను నివారించడానికి తేనె, వెల్లుల్లి, గుమ్మడి కాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్, పీచు పదార్థాలు, పుదీనా, కొబ్బరి వంటివి బాగా ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి

పచ్చి బొప్పాయి పేస్ట్: ఒక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి బొప్పాయి పేస్ట్ ను, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.

పాలు-పసుపు: గోరు వెచ్చటి పాలల్లో కొద్దిగా పసుపు కలిసి రోజూ తాగితే ఈ సమస్య తగ్గుతుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు పురుగులను నివారించడంలో బాగా సహాయపడతాయి.

గుమ్మడి కాయ విత్తనాలు: గుమ్మడి కాయ గింజలు కూడా నులి పురుగుల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుమ్మడి విత్తనాలకు పరాన్న జీవులను నశింపజేసే లక్షణం ఉంది. ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలను వేయించి, అర కప్పు కొబ్బరి పాలతో కలిపి తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి: వెల్లుల్లి రెబ్బలను వారం రోజుల పాటు పరగడుపున నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా కూడా నులి పురుగులు బయటకు పోతాయి.

లవంగాలు: ఒక గ్లాస్ నీటిలో 3 లవంగాలను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా వారంలో మూడు, నాలుగు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది.

వేపాకు: ఓ గ్లాస్ వాటర్ లో అర టీస్పూన్ వేపాకు పేస్ట్ ని పరగడుపున తాగితే.. కడుపులో ఉన్న నులి పరుగులు నశిస్తాయి.

కొబ్బరి: ప్రతి రోజూ ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును అల్పాహార సమయంలో తీసుకోవాలి. ఇది తీసుకున్న మూడు గంటల తర్వాత వేడి పాలల్లో.. రెండు టేబుల్ స్పూన్ల మజ్జిగను కలిపి తాగాలి. ఇలా వారం రోజుల పాటు తాగడం వల్ల కడుపులో పురుగులన్నీ పోతాయి.

ఈ విధంగా పైన చిట్కాలను పాటించడం వల్ల కడుపులో ఉన్న అన్ని రకాల పురుగులు నశిస్తాయి. సులభంగా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి