Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children: పిల్లలలో వచ్చే ఈ సమస్యని విస్మరిస్తున్నారా..! చాలా ప్రమాదం.. ఏంటో తెలుసుకోండి..?

Children: పిల్లలలో తరచుగా తలనొప్పి సమస్య ఉంటే అది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. ఈ సమస్య కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.

Children: పిల్లలలో వచ్చే ఈ సమస్యని విస్మరిస్తున్నారా..! చాలా ప్రమాదం.. ఏంటో తెలుసుకోండి..?
Children
Follow us
uppula Raju

|

Updated on: Nov 21, 2021 | 6:04 AM

Children: పిల్లలలో తరచుగా తలనొప్పి సమస్య ఉంటే అది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. ఈ సమస్య కారణంగా వారిలో అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా తలనొప్పుల సమస్యను ప్రజలు తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. పిల్లల్లో తలనొప్పికి సంబంధించి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా 5 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో తలనొప్పి సమస్య ఉంటుంది. కానీ తల్లిదండ్రులు చాలా సార్లు ఈ సమస్యని విస్మరిస్తారు. ఒక్కోసారి ఇది తీవ్రమైన వ్యాధి లక్షణం కావచ్చు. తలనొప్పి ప్రధానంగా రెండు రకాలు. ఒకటి సాధారణ నొప్పి ఇది కొంత సమయం తర్వాత తగ్గిపోతుంది. రెండో తలనొప్పి శరీరంలో లేదా తల భాగంలో ఇబ్బంది కారణంగా వచ్చే తలనొప్పి. ఈ సందర్భాలలో పిల్లవాడు చాలా సార్లు తన సమస్యను సరిగ్గా వ్యక్తపరచలేడు. కానీ తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లలను గమనిస్తూ ఉండాలి.

ఆహార కారణం వైద్యుల ప్రకారం.. చాలా సందర్భాలలో, జలుబు, సైనస్, ఏదైనా రకమైన జ్వరం కారణంగా పిల్లలకు తలనొప్పి సమస్య ఉంటుంది. ఈ పరిస్థితులలో వైద్యులు కొన్ని మందులను ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. ఇది కాకుండా రెండో కారణం బ్యాడ్ లైఫ్ స్టైల్‌. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలలో ఈ సమస్య కనిపిస్తుంది.

మానసిక అనారోగ్యం లక్షణం మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్నారులకు తలనొప్పి సమస్యలు ఉంటాయి. తగినంత నిద్ర లేకపోవడం, లేదా వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనయ్యే పిల్లలకు ఇది తరచుగా వస్తుంది. అందువల్ల తలనొప్పి సమస్యను సీరియస్‌గా తీసుకుని చికిత్స చేయడం అవసరం.

ఇలా చేయండి.. పిల్లల్లో తలనొప్పి సమస్య కొనసాగితే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లాలి. ఈ విషయంలో న్యూరాలజిస్ట్, సైకియాట్రిక్ నిపుణులను సంప్రదించాలి. తల్లితండ్రులు పిల్లలకు సొంతంగా మందులు ఇవ్వకూడదు. ఎందుకంటే పిల్లలకు తలనొప్పి వచ్చినప్పుడు నొప్పి నివారణ మాత్రలు ఇవ్వడం తరచుగా కనిపిస్తుంది. ఇది వేరే అరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.

Viral Video: రైలు పట్టాలపై కుందేలు.. వెనుకనే దూసుకొచ్చిన మృత్యువు.. చివరకు ఎం జరిగిందంటే..?

ఈ నెలలో విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నారట..! కారణాలు ఏంటో తెలుసా..?

తల్లిదండ్రులకు గమనిక..! పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే ఆ వ్యాధికి గురైనట్లే..?