డయబెటిస్‌ రోగులకు ఈ నీరు అమృతం.. ఉదయాన్నే తాగారంటే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..

|

Aug 26, 2024 | 9:43 PM

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి పెను ప్రమాదకరంగా మారుతోంది.. ప్రస్తుత కాలంలో ముధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది.. డయాబెటిస్‌ను సకాలంలో నియంత్రించకపోతే..

డయబెటిస్‌ రోగులకు ఈ నీరు అమృతం.. ఉదయాన్నే తాగారంటే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..
Diabetes
Follow us on

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధి పెను ప్రమాదకరంగా మారుతోంది.. ప్రస్తుత కాలంలో ముధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది.. డయాబెటిస్‌ను సకాలంలో నియంత్రించకపోతే.. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీల వ్యాధి, కళ్ల సమస్యలు వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది ఒకసారి వ్యాపిస్తే.. జీవితాంతం పీడిస్తూనే ఉంటుంది.. దీని నియంత్రణకు ఇప్పటివరకు సరైన ఔషధాలంటూ ఏవీ రాలేదు.. అయితే దీనిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదని.. బ్లడ్ షుగర్ నియంత్రణ కోసం చర్యలు తీసుకోవడం ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ బాధితులకు మెంతి నీరు..

అయితే.. మధుమేహం నియంత్రణకు మసాలా దినుసులు ఔషధంగా పనిచేస్తాయి.. అలాంటి సుగంధ ద్రవ్యాలలో మెంతులు ఒకటి.. ఇవి ఆహారం రుచిని పెంచడంతో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.. ఇవి డయాబెటిస్ బాధితులకు వరం లాంటివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే మెంతుల టీ లేదా మెంతి నీళ్ళు తాగడం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుందని పేర్కొంటున్నారు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ మెంతి నీటిని తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మెంతులు ప్రోబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వినియోగం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

మెంతికూర లేదా మెంతులలో సోడియం, జింక్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఎ, బి, సి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, ఫైబర్, ప్రోటీన్, స్టార్చ్, చక్కెర, ఫాస్ఫారిక్ యాసిడ్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి..

మెంతి గింజల నీటిని తయారు చేయడానికి, ముందుగా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. తర్వాత ఆ నీటిని వడపోసి మరుసటి రోజు ఉదయం తాగాలి.

మెంతి టీ కూడా తయారు చేసి తాగవచ్చు. దీనికోసం నీటిలో మెంతులను మరిగించి ఆ తర్వాత వడగట్టి తాగాలి.. దీనిలో రుచి కోసం నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు..

ఈ నీటిని ఉదయాన్నే తాగడం మంచిది.. దీనివల్ల షుగర్ అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

( ఈ వార్త కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని ఫాలో అయ్యేముందు డైటీషియన్లు సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..