Diabetes Diet: టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండటం తప్ప మరో మార్గం లేదు. అనియంత్రిత జీవన శైలి, అతిగా తినడం, తాగటం వంటివి ప్రజలలో మధుమేహం ప్రమాదాన్ని పెంచుతున్నాయి. చాలా సందర్భాలలో ఇతర వ్యాధుల కారణంగా శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ ఒకసారి మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే.. ఈ వ్యాధి ఎప్పటికీ తగ్గదు. అదనంగా, రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ కళ్ళు, మూత్రపిండాలు, చర్మంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. దీంతో పాటు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో మంచి జీవనశైలిని కూడా పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అతిగా తినడం, తాగడం మానేయాలి. మీరు తినేది, తాగేది మధుమేహంపై ప్రభావం చూపుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
అయితే, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే ఫుడ్స్‌లో అత్యంత కీలకమైనది ఉల్లిపాయ అని చెబుతున్నారు వైద్యులు. ఉల్లిపాయలో బ్లడ్ షుగర్‌ను నియంత్రించే సహజ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, దాదాపు చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను తప్పకుండా ఉపయోగిస్తారు. ప్రతీ కూరగాయలో ఉల్లిపాయను వినియోగిస్తారు. అయితే, తాజా ఉల్లిపాయలను తినడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
‘ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ ఇన్‌సైట్స్’ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. తాజా ఉల్లిపాయలు తినడం వల్ల టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయి. ఉల్లిపాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. దీని వలన ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తాజా ఉల్లిపాయలతో పాటు.. ఉల్లిపాయ రసం కూడా తాగొచ్చు. ఇది తక్కువ కాలరీలు కలిగిన డిటాక్స్ డ్రింక్. ప్రతిరోజూ ఉదయం ఉల్లిపాయ రసం తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. డయాబెటిక్స్ కోసం ఇది చవకైన హోమ్ రెమిడీ. దీనిని సులభంగా తయారు చేసుకుని, తినవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..