సింపుల్‌ డైట్‌తో 46 కిలోలు బరువు తగ్గిన పోలీస్‌ అధికారి.. అది కూడా ఎన్ని రోజుల్లోనో తెలుసా..

|

Jan 01, 2023 | 1:06 PM

బరువు తగ్గడం కోసం చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు. వ్యాయామం కూడా అలవాటు చేసుకుంటారు మరికొంతమంది. ఏది ఏమైనా ఫలితం కనిపిస్తే చాలనుకుంటారు. సాధారణంగా డైట్‌ చేస్తే నెలకు ఒకటి, రెండు కిలోలు..

సింపుల్‌ డైట్‌తో 46 కిలోలు బరువు తగ్గిన పోలీస్‌ అధికారి.. అది కూడా ఎన్ని రోజుల్లోనో తెలుసా..
Jitendra Mani Tripathi, Ips
Follow us on

బరువు తగ్గడం కోసం చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు. వ్యాయామం కూడా అలవాటు చేసుకుంటారు మరికొంతమంది. ఏది ఏమైనా ఫలితం కనిపిస్తే చాలనుకుంటారు. సాధారణంగా డైట్‌ చేస్తే నెలకు ఒకటి, రెండు కిలోలు తగ్గితేనే.. నేను బరువు తగ్గానంటూ అందరికి చెప్పుకుంటారు. దానిని పెద్ద అచీవ్‌మెంట్‌గా చెప్పుకుంటారు. నిజానికి వ్యాయామం, డైటింగ్‌లో మార్పుల కారణంగా బరువు తగ్గడం మంచి పరిణామామేకాదు. ఆరోగ్యవంతమైన జీవితానికి అవి ఉపయోగపడతాయి. అయితే ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ అధికారి అధిక బరువుతో తీవ్ర ఇబ్బందులు పడేవాడు. ఎలాగైనా బరువు తగ్గాలని లైఫ్‌ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఎనిమిది నెలలు తిరిగే సరికే అద్భుత ఫలితం కనిపించింది. డిప్యూటీ కమిషనర్ జితేంద్ర మణి త్రిపాఠికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిజమేనా అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అతడు130 కిలోల బరువు ఉండటంతో మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతో పాటు పలు ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. దీంతో తన లైఫ్‌స్టైల్‌ మార్చుకున్నారు పోలీస్ అధికారి.

2022 ప్రారంభంలో పోలీసు అధికారి తన జీవనశైలితో పాటు.. కొన్ని అలవాట్లను మార్చుకోవాలని డిసైడ్‌ అయ్యారు. ప్రతిరోజూ 15,000 అడుగుల దూరం వాకింగ్ చేసేవారు అంటే దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు నడిచేవారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం, చపాతీ వంటి ఆహారాలకు దూరంగా ఉంటూ.. కేవలం సూప్‌లు, సలాడ్‌లు, పండ్లు, కొబ్బరినీళ్లు వంటి అధిక పోషకాలున్న ఆహారాలు తీసుకునేవారు.

ఇలా తన డైట్‌లో మార్పులు చేయడంతో పాటు.. శారీరక వ్యాయామాల ద్వారా 46 కిలోలు తగ్గడంతో 130 కిలోల నుంచి దాదాపు 80 కిలోల వరకు బరువు తగ్గిన విషయం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..