శీతా కాలం వచ్చేసింది. ఈ సీజన్ వచ్చిందంటే.. ఆహారం, స్కిన్, హెయిర్ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జుట్టు, చర్మం, శరీరం నీర్జీవంగా తయారై అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. చలికాలం వచ్చేసింది కాబట్టి.. చలిగా అనిపిస్తుంది. దీంతో వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని పిస్తుంది. ముఖ్యంగా మంచు, చలి గాలి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇలా సీజన్ మారినప్పుడల్లా తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది చలి కాలం వస్తే పెరుగును దూరంగా పెడతారు. ఎందుకంటే పెరుగు తినడం వల్ల, మజ్జిగ తాగడం వల్ల జలుబు, ఫ్లూ, గొంతి నొప్పి వంటివి వస్తాయని నమ్ముతూంటారు. మరి ఇది నిజమేనా..? ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగులో ఎన్నో పోషకాలు:
పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా చెడు బ్యాక్టీరియాను తొలగించి.. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. ఇంకా పలు విటమిన్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం:
ఆయుర్వేదం చెప్పిన దాని ప్రకారం శీతా కాలంలో పెరుగుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది శ్లేష్మ స్రావంతో పాటు ఇతర గ్రంథుల స్రావాన్ని కూడా మరింత పెంచుతుంది. అంతే కాకుండా సైనస్, ఉబ్బసం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ వంటివి వస్తాయి కాబట్టి దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో పెరుగును తినకపోవడమే మంచిది.
సైన్స్ ప్రకారం:
సైన్స్ ప్రకారం పెరుగులో ప్రేగులకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అంతే కాకుండా పెరుగుతో పులియ బెట్టిన ఆహారం కూడా గొప్ప రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో క్యాల్షియం, విటమిన్ బి12, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. పెరుగు తీసుకోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే శ్వాస కోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు సాయంత్రం 5 గంటల తర్వాత పెరుగుకు దూరంగా ఉండాలి. లేదంటే జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
అయితే కొంత మంది నిపుణులు మాత్రం.. పెరుగులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి.. ఇది జలుబుతో బాధ పడేవారికి సహాయం చేస్తుందని, గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పెరుగును తింటే మంచిదని చెబుతున్నారు.
దీని ప్రకారం.. పెరుగు మొత్తానికే దూరంగా ఉంచాల్సిన అవసరం లేదు. శీతా కాలంలో పెరుగును పరిమితంగా తీసుకోవచ్చు. అలాగే జలుబు, ఫ్లూ వంటి వాటితో బాధ పడేవారు ఫ్రిజ్ లో ఉంచిన పెరుగు కంటే.. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన పెరుగును తినవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.